కథ
NagaChaitanya Thandel Review: శ్రీకాకుళంలోని డి.మత్యలేశం గ్రామ మత్యకారులు సంపాదన కోసం గుజరాత్ పోర్టుకు చేపల వేట కు వెళ్తుంటారు. మూడునెలలు ఊర్లో ఉంటే, తొమ్మిది నెలలు గుజరాత్ పోర్టులో చేపల వేట కు వెళ్తారు. ఈ మత్యకారుల లీడర్ ని తండేల్ అని పిలుస్తారు (NagaChaitanya Thandel Review)
తండేల్ రాజు (నాగ చైతన్య ), సత్య (సాయిపల్లవి ) ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటారు. అయితే… ఓ సారి చేపల వేట కు వెళ్లిన కొందరు మత్యకారులు కొందరు చనిపోపోతారు. దీంతో రాజు కి కూడా ఏమైనా అవుతుందని, రాజుని వేటకు వెళ్లొద్దు అని సత్య ప్రాధేయపడుతుంది. కానీ సత్య తనను అర్ధం చేసుకుంటుందని, రాజు మళ్ళీ వేటకు వెళ్తాడు. రాజు తన మాట వినలేదని, అతనిపై కోపం పెంచుకుంటుంది. మరొకర్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. మరో వైపు… ఓ జాలరిని కాపాడేందుకు రాజు ట్రై చేస్తాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ జలల్లోకి వెళ్తారు. పాకిస్తాన్ నేవి టీమ్.. 22 మంది తో ఉన్న.. రాజు అండ్ టీమ్ ని అరెస్ట్ చేస్తుంది. మరి.. రాజు అతని బృందం తిరిగి భారతదేశానికి ఎలా చేరుకున్నారు? రాజు కోసం… సత్య ఎలా పోరాడింది? పాకిస్తాన్ కరాచీ జైల్లో రాజు అండ్ టీమ్ ఎలా కష్ట పడ్డారు? అన్నది స్టోరీ (NagaChaitanya Thandel Review).

విశ్లేషణ
అమరన్ సినిమా లో మాదిరిగానే …..సాయి పల్లవి తన లవ్ స్టోరీని నరేట్ చేస్తూ తండేల్స్టరీ స్టార్ట్ అవుతుంది. నాగచైతన్య, సాయి పల్లవిల లవ్ సీన్స్ తో స్టార్ట్ అవుతుంది. సత్య కి ఇష్టం లేకుండా… రాజు వేటకు వెళ్లడంతో తొలిభాగం ముగుస్తుంది. బుజ్జి తల్లి, హైలెసా, నమో శివాయ : సాంగ్స్ సూపర్ గా ఉంటాయి. ముఖ్యంగా…..ఇంట్రవెల్ లో సముద్రం లో వచ్చే యాక్షన్ సీన్ లు … మెప్పిస్తాయి. సెకండ్ హాఫ్ అంతా…. ముఖ్యంగా పాకిస్తాన్ లో చిక్కుకున్న 22మంది పాయింట్ ఆఫ్ వ్యూ లో స్టోరీ సాగుతుంది. అలాగే సత్య… రాజు కోసం చేసే పోరాటం నేపథ్యంలో కథ ఉంటుంది. సెకండ్ హాఫ్ ని డ్రాగ్ చేసి నట్టు ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్. 2018 లో జరిగిన వాస్తవ ఘటన ల ఆధారంగా ఈ మూవీ తీశారు. కానీ కల్పిత కథ ను బాగా యాడ్ చేశారు. సినిమాటిక్ లీబార్టీ తీసుకున్నారు. కొన్ని సీన్స్ వాస్తవనికి దూరంగా ఉంటాయి.
పెర్ఫార్మెన్స్
రాజు పాత్రలో నాగ చైతన్య సూపర్బ్ గా యాక్ట్ చేసాడు. లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ లో అ రకొట్టాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే… జైలు సీన్స్ నెక్స్ట్ లెవల్లో యాక్ట్ చేసాడు. ఇంట్రవెల్, జైలు యాక్షన్ సీన్స్ లో మెప్పించాడు చైతన్య. చైతన్య కష్టం స్క్రీన్ పై కనిపిస్తుంది. యాస కూడా పర్వాలేదనిపి స్తోంది. సత్య గా సాయి పల్లవి మరోసారి తన యాక్టింగ్ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంది. ఎమోషనల్ సీన్స్ లో తన మార్క్ స్టైల్ యాక్టింగ్ చూపించింది. కానీ సెకండ్ హాఫ్ లో సాయి పల్లవి రోల్ కాస్త డౌన్ అవుతింది. బహుశా.. నాగ చైతన్య రోల్ ని స్ట్రాంగ్ చేయడానికి డైరెక్టర్ ఇలా చేసి ఉండొచ్చు. సత్య ను ఇష్టపడే వ్యక్తి గా కరుణాకరన్ పర్వాలేదానిపించారు.సాయి పల్లవి తండ్రి సోమయ్య గా పృథ్వి రాజు, దద్దా అలియాస్ లింగయ్య గా నరేన్, దివ్య , జైలర్ గా ప్రకాష్ బెల్ వాడి వాళ్ళ పాత్రల మేరకు చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆజాది సాంగ్…బాగున్నాయి. శ్రీ నాగేంద్ర తంగాల ఆర్ట్ వర్క్, శ్యామ్ దత్ విజువల్స్ బాగున్నాయి. కొంత ఎడిటింగ్ వర్క్ ఉంది.
రేటింగ్ : 2.5/5