please subscribe to Tollywoodhub YouTube channel

నాగచైతన్య తండేల్‌ మూవీకి పాజిటివ్‌ వైబ్స్‌

Viswa
1 Min Read
Nagachaitanya Thandel Movie

Web Stories

నాగచైతన్య లేటెస్ట్‌ మూవీ ‘తండేల్‌’ (Thandel) సినిమా ఫిబ్రవరి 7న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్‌ను యాక్టివ్‌ చేశారు మేకర్స్‌. ఇందులో భాగంగా విడుదలైన ‘తండేల్‌’ సినిమా తెలుగు ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. లవ్‌, ఎమోషన్‌, దేశభక్తి…అంశాల మేళవింపుతో ఈ ‘తండేల్‌ ట్రైలర్‌ (Nagachaitanya Thandel trailer) ఆకట్టుకుంటోంది.

చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు ఈ మూవీని దాదాపు రూ. 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొం దించారు.  ‘లవ్‌స్టోరీ’ మూవీ తర్వాత నాగచైతన్య (Nagachaitanya), సాయిపల్లవి (Saipallavi)లు మళ్లీ ‘తండేల్‌’ (Nagachaitanya Thandel trailer) సినిమా కోసం హీరో హీరోయిన్లుగా నటించారు. అలాగే ‘ప్రేమమ్‌, సవ్యసాచి’ల చిత్రాల తర్వాత నాగచైతన్య- చందూ మొండేటి కాంబినేషన్‌లో రూపొందిన మూవీ ‘తండేల్‌’.

కథ! (ప్రచారంలో ఉన్న విధంగా..)

శ్రీకాకుళంలో జరిగిన వాస్తవ సంఘంటల ఆధారంగా ‘తండేల్‌’ మూవీ తీశారు. 2018లో జీవనోపాధి కోసం ఉత్తరాంధ్రకు చెందిన దాదాపు పాతిక మంది జాలరులు గుజరాత్‌ తీరానికి వెళ్తాడు. కానీ పొరపాటున అక్కడ…సముద్రంలో ఇండియా సరిహద్దును దాటి, పాకిస్తాన్‌ కోస్టు గార్డులకు బందీ లుగా చిక్కుతారు.  ఈ పాతిక మంది గ్రూప్‌ లీడర్‌(తండేల్‌) రాజు (ఈ సినిమాలో నాగచైతన్య పాత్ర పేరు) అప్పుడు ఏం చేశాడు? అన్నది ఈ సినిమా కథనం. అలాగే సత్య (సాయిపల్లవి), రాజు(నాగచైతన్య)ల ఎమోషనల్‌ లవ్‌స్టోరీ కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది.

నాగచైతన్య కెరీర్‌లోనే హాయ్యెస్ట్‌ బడ్జెట్‌తో రూపొందిన ‘తండేల్‌’ మూవీపై అక్కినేని అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. అలాగే తండేల్‌ సినిమా మూవీ రిజల్ట్‌ కూడా నాగచైతన్య కెరీర్‌కు ఎంతో కీలకం. దీంతో తండేల్‌ రిజల్ట్‌ ఎలా ఉండబోతుందా? అనే టాక్‌ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi