please subscribe to Tollywoodhub YouTube channel

న్యాచురల్ స్టార్ తో జత కడుతున్న పూజా హెగ్డే..!

Kumar NA

Web Stories

Poojahegde new film: టాలీవుడ్‌లో ఒకప్పుడు గోల్డెన్ లెగ్‌గా వెలిగిపోయిన బుట్టబొమ్మ పూజా హెగ్డే (Poojahegde), మళ్లీ తన పూర్వ వైభవం కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే, కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల పరాజయాలను మూటగట్టుకున్న ఈ భామ, ‘ఆచార్య’ తర్వాత తెలుగు తెరకు కాస్త దూరమైంది. ఇటీవల రజనీకాంత్ ‘కూలీ’ చిత్రంలో ‘మోనిక’గా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చినప్పటికీ, అది ఆమె కెరీర్‌కు పెద్దగా ప్లస్ అవ్వలేదనే చెప్పాలి (Poojahegde new film).

అయితే, ఇప్పుడు ఈ అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్‌ను చాలా ప్లాన్డ్‌గా మొదలుపెట్టింది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ – రవి నెలకుడిటి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌లో పూజ హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి తోడు, ఇప్పుడు మరో భారీ ఆఫర్ ఆమెను వరించినట్లు సమాచారం. నేచురల్ స్టార్ నాని, స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ప్రతిష్టాత్మక చిత్రంలో పూజా హెగ్డేను కథానాయికగా ఎంపిక చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ముగిసిన వెంటనే, అంటే 2026, జూన్ నుండి సుజిత్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది (Poojahegde new film).

నిహారిక ఎంటర్టైన్మెంట్, యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘ఓజీ’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సుజిత్, ఈసారి తనదైన యాక్షన్, కామెడీ మరియు స్టైలిష్ ఎలిమెంట్స్‌తో నానిని సరికొత్తగా చూపించబోతున్నారు. ఈ చిత్రంలో నాని మేకోవర్ చాలా విభిన్నంగా ఉండబోతోందని, అలాగే పూజా హెగ్డే పాత్రకు కథలో చాలా వెయిట్ ఉంటుందని తెలుస్తోంది. 2027లో విడుదల కానున్న ఈ సినిమాతో పూజా హెగ్డే టాలీవుడ్‌లో మళ్ళీ టాప్ గేర్‌లోకి వెళ్లడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi