విజయ్ – రష్మిక వెడ్డింగ్ కి నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్..!

Kumar NA

Web Stories

Vijay- Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఈ ఇద్దరి పేర్లు వింటేనే సోషల్ మీడియాలో వైబ్స్ వేరే లెవల్‌లో ఉంటాయి. వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉన్నా, రీసెంట్‌గా వీరి వివాహం గురించిన వార్తలు నెట్టింట సెన్సేషన్‌గా మారాయి. తాజాగా ఈ క్రేజీ కపుల్ వెడ్డింగ్‌కి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

నేటి కాలంలో సెలబ్రిటీల పెళ్లిళ్లంటే కేవలం వేడుకలు మాత్రమే కాదు, అవి ఓ కమర్షియల్ ఈవెంట్స్ కూడా. నయనతార – విఘ్నేష్ శివన్ వెడ్డింగ్ డాక్యుమెంటరీని నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో విజయ్-రష్మిక వివాహ వేడుక వీడియో హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 60 కోట్ల భారీ డీల్‌ను ఆఫర్ చేసినట్లు సమాచారం. ఒక రకంగా చెప్పాలంటే ఇది నయనతార డీల్ (రూ. 25 కోట్లు) కంటే రెట్టింపు కన్నా ఎక్కువే. ఈ ఆఫర్‌తో వీరిద్దరికీ ఉన్న పాన్ ఇండియా క్రేజ్ ఏంటో మరోసారి స్పష్టమైంది. అయితే, అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. విజయ్ దేవరకొండ ఈ మెగా ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారట. తన జీవితంలోని అత్యంత వ్యక్తిగతమైన, మధురమైన క్షణాలను బిజినెస్ యాంగిల్‌లో చూడటం విజయ్‌కి ఇష్టం లేదని తెలుస్తోంది.

పెళ్లి అనేది కేవలం కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య జరగాల్సిన ప్రైవేట్ వేడుక అని, దాన్ని కమర్షియల్ చేయడం సరికాదని ఆయన భావిస్తున్నారట. కోట్లాది రూపాయల ఆఫర్ కంటే కూడా, తన పెళ్లి జ్ఞాపకాలను స్వచ్ఛంగా ఉంచుకోవడమే మిన్న అని విజయ్ నిర్ణయించుకున్నట్లు టాక్. ఈ నెల 26న పెళ్లి జరగబోతోందంటూ వార్తలు వస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు వీరిద్దరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, నెట్‌ఫ్లిక్స్ ఆఫర్‌ను విజయ్ రిజెక్ట్ చేశారనే వార్త మాత్రం ఆయన వ్యక్తిత్వాన్ని చాటిచెబుతోంది. ఈ వార్త విన్న ఫ్యాన్స్ విజయ్ నిజంగా రౌడీ స్టార్ మాత్రమే కాదు, రియల్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos