please subscribe to Tollywoodhub YouTube channel

అఫీషియల్..’డ్రాగన్’ లో యానిమల్ స్టార్ ఎంట్రీ..!

Kumar NA

Web Stories

NTR Dragon Update: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ గురించి ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటికొచ్చింది. గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ, బాలీవుడ్ దిగ్గజ నటుడు అనిల్ కపూర్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు స్వయంగా ప్రకటించారు. బాలీవుడ్ వర్గాల్లోను, ఇటు సౌత్ ఫిల్మ్ సర్కిల్స్ లోనూ అనిల్ కపూర్ ఎంట్రీపై చర్చ జరుగుతుండగా, ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా క్లారిటీ ఇచ్చారు (Telugu cinema).

‘వార్ 2’ షూటింగ్ ముగిసిందని చెబుతూ, తన తదుపరి చిత్రాల లైనప్‌లో ‘డ్రాగన్’ పోస్టర్‌ను ఆయన ట్యాగ్ చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ – అనిల్ కపూర్ కలిసి ‘వార్ 2’లో నటిస్తుండగా, ‘డ్రాగన్’ వీరిద్దరి కలయికలో రాబోతున్న రెండో సినిమా కావడం విశేషం. ఇందులో అనిల్ కపూర్ ఒక పవర్‌ఫుల్ విలన్‌గా లేదా అత్యంత కీలకమైన పాత్రలో కనిపిస్తారని సమాచారం. దర్శకుడు ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో ఇతర భాషల స్టార్ హీరోలకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఇవ్వడంలో దిట్ట. ‘సలార్’లో పృథ్వీరాజ్‌ను చూపించిన విధంగానే, ‘డ్రాగన్’ కోసం భారీ తారాగణాన్ని ఎంచుకున్నారు. ఈ సినిమాలో మలయాళ నటులు టొవినో థామస్, బీజు మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ‘కాంతార’ బ్యూటీ రుక్మిణి వసంత్, ఎన్టీఆర్ సరసన కథానాయికగా నటిస్తోంది. సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది హైదరాబాద్ లో ప్లాన్ చేసిన ఒక కీలకమైన షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. తదుపరి చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ త్వరలోనే విదేశాలకు వెళ్లనుంది (Telugu cinema).

అక్కడ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేసినట్లు సమాచారం. వచ్చే షెడ్యూల్‌లోనే అనిల్ కపూర్ సెట్స్‌లో జాయిన్ కాబోతున్నారు. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, ప్రశాంత్ నీల్ టేకింగ్, అనిల్ కపూర్ నటన తోడైతే ‘డ్రాగన్’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు (Telugu movie updates).

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi