Pawan Kalyan HariHaraVeeraMallu: పవన్‌కళ్యాణ్ (Pawan Kalyan )కెరీర్‌లోని పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ ‘హరిహరవీరమల్లు’ (HariHaraVeeraMallu). నిజానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. ఈ సినిమాకు తొలుత క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమానుంచి దర్శకుడిగా ఆయన తప్పుకున్నారు. ఇలా ఈ సినిమా చిత్రీకరణ కొంతకాలం నిలిచిపోయింది. ఆతర్వాత పవన్‌కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా మరింత ఆలస్యమైంది. ఎట్టకేలకు హరిహరవీరమల్లు సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.
రెండుమూడ్రోజుల్లో హరిహరవీరమల్లు సినిమా భారీ షెడ్యూల్ చిత్రీకరణ విజయవాడలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ పూర్తయితో ‘హరిహరవీరమల్లు’ సినిమా చిత్రీకరణ ఆల్మోస్ట్ పూర్తవుతుంది. ఈ షెడ్యూల్‌లో పవన్‌కల్యాణ్, అనుపమ్‌ఖేర్‌ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. ఇంకా నిధీ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, రఘబాబు, నాజర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Power Update Alert!!
@PawanKalyan will be joining the shoot of #HariHaraVeeraMallu from this weekend!Veera Mallu will meet you in theatres on 28th March, 2025! Be excited! pic.twitter.com/3UyjCAWeiB
— TollywoodHub (@tollywoodhub8) November 27, 2024
ఇక హరిహరవీరమల్లు సినిమా రెండు పార్టులుగా విడుదల కానుంది. తొలిపార్టుగా ‘హరిహరవీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’గా మార్చి 28న రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే గతంలో హరిహరవీరమల్లు (Pawan Kalyan HariHaraVeeraMallu) సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ సారి అయిన అనుకున్న తేదీకి ‘హరిహరవీరమల్లు’ సినిమా థియేటర్స్‌లోకి వస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాకు ఎమ్‌ఎమ్ కీరవాణి స్వరకర్త.