బాకీలు సెటిల్‌ చేస్తున్న పవన్‌కల్యాణ్‌?

Viswa
Pawankalyan Nect film With Director Surender Reddy

Web Stories

Pawan Kalyan is completing pending films: పవన్‌కల్యాణ్‌ లాంగ్‌ పెండింగ్‌ ప్రాజెక్ట్స్‌ ‘హరిహరవీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు రిలీజైయ్యాయి. పవన్‌కల్యాణ్‌ ఆల్రెడీ కమిటైన ‘ఉస్తాద్‌భగత్‌సింగ్‌’ చిత్రీకరణ కూడా పూర్తి కావొచ్చింది. ఇక పవన్‌ నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ గురించే ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

దర్శకుడు అనిల్‌రావిపూడితో పవన్‌ కల్యాణ్‌ ఓ సినిమా చేస్తారనే ప్రచారం సాగుతోంది. అలాగే తమిళ దర్శకులు లోకేష్‌ కనగరాజ్, సముద్రఖని వంటి వార్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అ యితే ఈ సినిమాలకన్నా, ముందుగా ఓ పెండింగ్‌ ప్రాజెక్ట్‌ను కంప్లీట్‌ చేయాలనుకుంటున్నారట పవన్‌కల్యాణ్‌. అదే దర్శకుడు సురేందర్‌రెడ్డి సినిమా.

పవన్‌కల్యాణ్, నిర్మాత రామ్‌ తాళ్లూరి, దర్శకుడు సురేందర్‌రెడ్డిల కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఎప్పుడో వచ్చింది. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. అయితే నిర్మాత రామ్‌ తాళ్లూరి (ఇప్పుడు జనసేన నేత కూడా) దగ్గర పవన్, సురేందర్‌రెడ్డి ఎప్పుడో అడ్వా న్స్‌ లు కూడా తీసుకున్నారట. ఈ హీరో, దర్శకుడు అప్పట్లో భారీ మొత్తాన్నే అడ్వాన్స్‌గా పొందా రట. ఈ నేపథ్యంలో సురేందర్‌రెడ్డి సినిమాను టేకాఫ్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారట పవన్‌ కల్యాణ్‌.

అయితే సురేందర్‌రెడ్డి, రైటర్‌ వక్కంతం వంశీ కాంబినేషన్‌లో ‘కిక్‌’, ‘రేసుగుర్రం’ వంటి సిని మాలొచ్చి, బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో సురేందర్‌రెడ్డి–వక్కంతం వంశీ కాంబి నేషన్‌తో బాగుంటుందని పవన్‌ భావిస్తున్నారట. ఇందుకు తగ్గట్లే పనులు కూడా జరుగు తున్నాయిని, ఈ సినిమాను గురించి, మరో అప్‌డేట్‌ త్వరలోనే రానుందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇలా పవన్‌ తాను కమిటైన ఒక్కో పెండింగ్‌ సినిమాను పూర్తి చేస్తూ, ముందుకెళ్తున్నారు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos