Pawankalyan OG Movie trailer: పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఓజీ’ సినిమా ట్రైలర్ (OG Movie trailer) విడుదలైంది. ఈ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు సుజిత్ (OG Movie Director Sujith)దర్శకత్వం వహించగా, ప్రియాంక మోహన్ హీరో యిన్‌గా చేశారు. ఇమ్రాన్ హష్మి విలన్ రోల్ చేశాడు. అర్జున్ దాస్, శ్రియారెడ్డి, ప్రకాష్‌రాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. బాంబే నేపథ్యంతో సాగే పీరియాడికల్ యాక్షన డ్రామా ఇది. ఈ సినిమాలో ప్రధాన కథాంశంగా డాటర్ సెంటిమెంట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఓజాస్ గంభీర అలియాస్ ఓజీ పాత్రలో పవన్‌కల్యాణ్ నటించారు. సత్య దాదా అలియాస్ సత్యనారాయణగా ప్రకాష్‌రాజ్, కణ్మనిగా ప్రియాంక మోహన్ కనిపిస్తారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ (OG Movie Musis Director Taman S).
గ్యాంగ్ వార్స్ మళ్లీ మొదలైయ్యాయి…కానీ ఈ సారి గన్స్ అన్నీ సత్యదాదా వైపు తిరిగాయి
దాదా వరకు వెళ్లారంటే పరిస్థితి చేయిజారిపోతున్నట్లుగా ఉంది.
వాళ్ళ ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే..!
ఎవరు…వాడైతే కాదుగా…!
నిన్ను కలవాలని కొందరు..చూడాలని ఇంకొందరు…చంపాలని అందరు ఎదురుచూస్తున్నారు!
బాంబే వస్తున్నా…తలలు జాగ్రత్త!
ఓజాస్ గంభీర…ఓజాస్ గంభీర..నా కొడకల్లారా..!
ఓ రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ట్రైలర్‌గా ‘ఓజీ’ కనిపించింది. పవన్‌కు రెండుమూడు డైలాగ్స్ మాత్రమే పెట్టారు. ఇలా మేజర్‌గా కథ రివీల్ కాకుండ జాగ్రత్త పడ్డారు. ‘ఓజీ’ సినిమా ఈ సెప్టెంబరు 25న విడుదల కానుంది. సెప్టెంబరు 24న ఈ సినిమా ప్రిమియర్స్‌ను ప్లాన్ చేశారు. సో…సెప్టెంబరు 25 రాత్రినాటికే ‘ఓజీ’ సినిమా భవితవ్యం తెలుస్తుంది. ఇక హరిహర వీరమల్లు వంటి డిజాస్టర్ మూవీ తర్వాత పవన్‌కల్యాణ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. ట్రైలర్ కూడా ప్రామిసింగ్‌గా ఉంది. సినిమాను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.