please subscribe to Tollywoodhub YouTube channel

రాజాసాబ్‌ ప్రభాస్‌ …క్యా హో రహా హై!

Viswa
Prabhas The Rajasaab teaser

Web Stories

ప్రభాస్‌ (Hero Prabhas) తొలిసారిగా నటిస్తున్న హారర్‌ కామెడీ అండ్‌ ఫ్యాంటసీ మూవీ ‘ది రాజాసాబ్‌’ (TheRajasaab movie ) . ఈ సినిమాకు మారుతి దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిధీ అగర్వాల్, రిద్దికుమార్, మాళవికా మోహనన్‌ హీరోయిన్స్‌గా కనిపిస్తారు. సంజయ్‌దత్‌ ఓ ప్రధాన పాత్రధారి. హాస్యనటుల్లో సప్తగిరి ఉన్నాడు. లేటెస్ట్‌గా ఈ రాజాసాబ్‌ సినిమా టీజర్‌ (TheRajasaab Teaser)ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ టీజర్‌లోని డైలాగ్స్‌ ఈ విధంగా ఉన్నాయి.

ఈ ఇల్లు నా దేహం..
ఈ సంపద నా ప్రాణం….
నా తదనంతరం కూడా దిన్ని నేను మాత్రమే అనుభవిస్తాను (సంజయ్‌దత్‌ కావొచ్చు)

హలో …హలో…బండి కాస్త మెల్లగా…
అసలే మన లైఫ్‌ అంతంత మాత్రం…. (ప్రభాస్‌)

Prabhas TheRajasaab Releasein in Dec05

హే జగన్నాథ…ప్రభు..క్యా హో రహా హై…

అమ్మా…దుర్గమ్మ తల్లి కాపాడమ్మా…
తాత వైయర్‌ కొరికేసాడెమో చూడండ్రా…బయట! (ప్రభాస్‌)

చెప్పు చేసిన పాపం ఏమి…. (హీరోయిన్‌ నిధీ అగర్వాల్‌)
నేరాలు..పాపాలు ఏంటండి….డిగ్నిఫైడ్‌గా లవ్‌ చేస్తేని… (ప్రభాస్‌)

చచ్చే వరకు చేయి వదలని…వేయాల్సిన ముద్రలు వేసేశావ్‌…. (హీరోయిన్‌ మాళవిక మోహనన్‌)
మేడమ్‌…ఏదో తాగిన మత్తులు కరిసేనట్టున్నాను…. (ప్రభాస్‌)

ఇక ‘ది రాజాసాబ్‌’ సినిమా రిలీజ్‌ పలువాయిదాల తర్వాత డిసెంబరు 5న (TheRajasaabRelease) రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా తాత–మనవళ్ళ బ్యాక్‌డ్రాప్‌తో సాగు తుంది. ఈ సినిమాలో తాత పాత్రలో సంజయ్‌దత్‌ కనిపిస్తాడు. అలాగే ఈ మూవీలో ప్రభాస్‌ ఫ్లాష్‌బ్యాడ్‌ ఎసిపోడ్స్‌ కూడా ఉన్నాయి. ఈ ఏపిసోడ్స్‌ ఈ సినిమాకు కీలకంగా ఉంటా యి. మొదట్లో ‘ది రాజా సాబ్‌’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు.. ఓకే పార్టుగా రిలీజ్‌ చేయబోతున్నారు. అయితే..ఈ సినిమా నిడివి మాత్రం 3 గంటలకుపైనే ఉంది. ఈ సిని మాకు తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పుడు ఆల్మోస్ట్‌ పూర్తయింది. ఇక ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ సినిమాను కొనుగోలు చేసి, తెలుగులో విడుదల చేసిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు సరైన ఫలితాలు రాలేదు. మరి..ఆ బాక్సాఫీస్‌ బాకీని, ‘ది రాజాసాబ్‌’ సినిమా వడ్డీతో సహా చెల్లిస్తుందెమో చూడాలి. మరి…!

మరోవైపు వరుస యాక్షన్‌ సినిమాలు చేస్తున్న ప్రభాస్, హారర్‌–కామెడీ జానర్‌లో సినిమా చేయడం బాగానే ఉంది. ఈ తరహా పాత్రలో ప్రభాస్‌ను చూసి ఆడియన్స్‌ కూడా కొత్తగా ఫీలవుతారు. మరి…‘ది రాజాసాబ్‌’ సినిమా బాక్సాఫీస్‌ రిజల్ట్‌ ఎలా ఉంటుందో చూడాలి.

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi