రాజాసాబ్‌ ఆగమనం ఎప్పుడంటే..!

Viswa

Web Stories

ప్రభాస్‌ (Prabhas) ఫ్యాన్స్‌ ఎప్పట్నుంచో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ‘ది రాజాసాబ్‌’ (Prabha’s Rajasaab Release) సినిమా రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది. డిసెంబరు 5న ‘ది రాజాసాబ్‌’ సినిమా విడుదల కానుంది (Prabha’s Rajasaab Release Date). మంగళవారం ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు.  అలాగే ఈ నెల 16 ఉదయం రాజా సాబ్‌ సినిమా టీజర్‌ విడుదల కానుంది.గతంలో ‘ది రాజాసాబ్‌’ సినిమాను ఏప్రిల్‌ 10న రిలీజ్‌ చేస్తామని ప్రకటించినా, కుదర్లేదు. వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఉండటంతో, ఏప్రిల్‌ 10న సినిమా విడుదల సాధ్యపడలేదని అప్పట్లో మేకర్స్‌ చెప్పుకొచ్చారు.

ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’ (Prabha’s Rajasaab) సినిమా సుదీర్ఘంగా సాగుతుంది. ప్రభాస్‌ తొలిసారి హారర్‌ కామెడీ జానర్‌లో ఈ మూవీ చేస్తున్నాడు. మారుతి ఈ సినిమాకు దర్శ కుడు. మాళవిక మోహనన్,నిధీ అగర్వాల్‌లు ఈ సినిమాలో మెయిన్‌ లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు. ‘రాధేశ్యామ్‌’లో ఓ కీలక పాత్రలో యాక్ట్‌ చేసిన రిద్ది కుమార్‌ కూడా ఈ ‘ది రాజా సాబ్‌’ సినిమాలో కనిపిస్తారు. సప్తగిరి, వెన్నెల కిశోర్‌ వంటి హాస్యనటులు ఈ సినిమాలో ఉన్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ భారీ బడ్జెట్‌తో , ఈ ది రాజాసాబ్‌ సినిమాను తీస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తమన్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌.

ది రాజాసాబ్‌ (Prabha’s Rajasaab Story)  సినిమా మూడు తరాల నేపథ్యంతో సాగుతుంది. ఓ పాడుబడిన థియేటర్‌ వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు కీలకంగా ఉంటాయి. ఈ సినిమా థియేటర్‌ పేరు రాజా డీలక్స్‌ అని,అందుకే ఈ సినిమాకు ది రాజాసాబ్‌ అనే టైటిల్‌ను పెట్టారనే టాక్‌ వినిపిస్తూనే ఉంది. ఓ దశలో ఈ సినిమాకు రాజాడీలక్స్, అంబా సిడర్‌ అనే టైటిల్స్‌ను మేకర్స్‌ పరిశీలించిన విషయం గుర్తుండే ఉంటుంది.

మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే…. ఈ సినిమాలో సంజయ్‌దత్‌ ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. దెయ్యంగా ఆయన కనిపిస్తారట. ఇంకా ఈ మూవీలో మాళవికా మోహ నన్‌కు కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు చేస్తారు. ప్రభాస్‌ పాత్రలో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయి. ముఖ్యంగా ప్రభాస్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ సన్నివేశాలు సినిమాలో కీలకంగా ఉండబోతున్నాయట. అంతేకాదు..ఈ ‘ది రాజాసాబ్‌’ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ కూడా ఉంది. ఈ సాంగ్‌లో ఓ టాప్‌ హీరోయిన్‌ కనిపిస్తారు. గతంలో నయనపేరు తెరపైకి వచ్చినా, ఆమె ఈ స్పెషల్‌ సాంగ్‌ చేయలేదు. ఇంకా ‘ది రాజాసాబ్‌’ (Prabha’s Rajasaab movie two parts)  సినిమా రెండు పార్టులుగా కూడా విడుదల అయ్యే చాన్సెస్‌ ఉన్నాయనే టాక్‌ వినిపిస్తోంది.

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos