కథ
Priyadarshi Court movie Review: మెట్టు చంద్రశేఖర్ (రోషన్) ఇంటర్‌ఫెయిలైన పేదింటి కుర్రాడు. తన కంటే ఉన్నతమైన కుటుంబంలోని ఇంటర్ విద్యార్థిని జాబిల్లి (శ్రీదేవి) ని ప్రేమిస్తాడు. జాబిల్లి మేనమామ రైస్‌మిల్లు ఓనర్ మంగపతికి వీరి ప్రేమ విషయం తెలుస్తుంది. పెద ఇంటి అబ్బాయిలంటే చులకన భావం, తమ ఇంటి అమ్మాయిల భద్రతే పరువు,గౌరవ–మర్యాదలుగా భావించే మంగపతికి చంద్రశేఖర్–జాబిల్లిల ప్రేమ అస్సలు నచ్చదు. దీంతో జాబిల్లి మైనర్ అనే విషయాన్ని ఆయుధంగా మలుచుకుని, లాయర్ దామోదర్ (హర్షవర్ధన్)సాయంతో చంద్ర శేఖర్‌పై పోక్సో కేసు పెట్టిస్తాడు మంగపతి (శివాజీ). పోలీసులు చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేస్తారు. అలాగే తన పలుకుబడితో చంద్రశేఖర్ తరఫున ఏ లాయర్ వాదనలు వినిపించకుండ చేస్తుంటాడు మంగపతి. ఈ క్రమంలో చంద్రశేఖర్ తరఫు వారు విజయవాడలోని సీనియర్ లాయర్ మోహన్‌రావు (సాయికుమార్)ను సంప్ర దించాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈ కేసును మోహన్‌రావు దగ్గర జూనియర్‌గా పనిచేసే సూర్యతేజ (ప్రియదర్శి) టేకప్ చేయాల్సి వస్తుంది. మరి…సూర్యతేజ కేసు గెలిచాడా? అసలు..చంద్రశేఖర్ బయటకు వచ్చాడా? పోక్సో చట్టం ఎంత బలమైనది? సూర్యతేజ కేసు గెలవకుండ మంగ పతి ఏమైనా చేసాడా? ఫైనల్‌గా చంద్రశేఖర్‌కు న్యాయం దక్కిందా? అనేది సినిమాలో చూడాలి.
విశ్లేషణ
అసలు పోక్సో చట్టం అంటే ఏమిటి? ఈ చట్టంపై అవగాహన ఎందుకు ఉండాలి? అనే అంశాన్ని ప్రేమకథ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో మిళితం చేసి దర్శకుడు జగదీష్ (Court movie Director RamJagadeesh) ఈ సినిమాతో చెప్పాలనే ప్రయత్నం చేశాడ నిపి స్తోంది. ఈ ప్రయత్నంలో జగదీష్ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. చదువుకునే రోజుల్లోనే చట్టాలపై అవ గాహన కలిగేలా కొన్ని చట్టాలు ఉండాలనే అంశం కూడా ఆలోచన కలిగించే అంశమే. ఇంకా…పేదంటి యువతీయవకులు మంగపతి వంటి క్రూర మనస్తత్వంగల వారి చేతుల్లో ఎలా బలి అవుతారనే విషయం కూడా ఈ సినిమాలో చర్చకు రావడం బాగుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కోర్టు సీన్స్ అదిరిపో తాయి. స్క్రీన్ ప్లే కూడా బాగానే కుదిరింది. క్లైమాక్స్ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది.

కానీ తొలిభాగం వచ్చే చంద్రశేఖర్–జాబిల్లిల లవ్ ట్రాక్ రోటీన్‌గా ఉంటుంది. ఊహాత్మాక సన్నివేశాలు కళ్లముందున్న తెరపై కనిపిస్తుంటాయి. కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. తొలి భాగంలో ప్రధానంగా ఉన్న చంద్రశేఖర్–జాబిల్లిల రోల్స్ ఒక్కసారిగా సైడ్ అయిపోతాయి. వీటికి తోడు కొన్ని లాజిల్‌లెస్ సీన్స్ ఉన్నాయి. కానీ ఎంగేజింగ్ కోర్టు రూమ్ డ్రామా వీటిని కప్పేస్తుంది.
పెర్ఫార్మెన్స్
మంగపతి పాత్రలో కనిపించిన శివాజీ (Actor Sivaji) యాక్టింగ్ అదిరిపోతుంది. నెగటివ్ షేడ్స్‌లో కనిపించినా…శివాజీ పాత్రయే ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. అలాగనీ లాయర్ సూర్యతేజ పాత్రలో ప్రియదర్శి యాక్టింగ్ ను తక్కువగా చేసి చెప్పలం. ఒక రకంగా సెకండాఫ్ అంతా ప్రియదర్శి (Priyadarshi) భుజాలపైనే నడిచినట్లుగా అనిపి స్తుంది. కోర్టు రూమ్ సన్నివేశాల్లో ప్రియదర్శి తనలోని యాక్టర్‌ను మరోసారి బయటకు తీసి, ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టించేలా చేశాడు. చంద్రశేఖర్‌గా రోషన్, జాబిల్లిగా శ్రీదేవిలకు మంచి పాత్రలే లభించాయి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో రోషన్ యాక్టింగ్ బాగుంటుంది. లాయర్ దామోదర్‌గా హర్షవర్థన్ పెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడతాయి. మరో లాయర్ మోహన్‌రావుగా సాయికుమార్ యాక్టింగ్‌ను గురించి చూడా చెప్పుకోవాలి. ఓ హైలైట్ సీన్ కూడా ఉంది. రోహిణీ, శుభలేక సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషిక, వడ్లమాని శ్రీనివాస్…లు వారి వారి పాత్రల మేరకు యాక్ట్ చేశారు.
నాని (Nani) వాల్‌పోస్టర్ సినిమా నిర్మాణవిలువలు, ప్రశాంతి తిపిర్నేని నిర్మాణ జాగ్రత్తలు ఉన్నతంగా ఉన్నాయి. విజయ్ బుల్గానిన్ సంగీతం పర్వాలేదు. కానీ ఆర్‌ఆర్ ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. రామ్ జగదీష్ –కార్తికేయ శ్రీనివాస్– వంశీధర్ సిరిగిరిల…స్క్రీన్ ప్లే బాగుంది. ఆర్ కార్తీక శ్రీనివాస్ ఇంకాస్త ఎడిటింగ్ చేయవచ్చు. దినేష్ పురుషోత్తమన్ విజువల్స్ ఓకే.
ఫైనల్‌గా…: ఆడియన్స్ టికెట్ డబ్బులకు న్యాయం చేకూరుతుంది.
రేటింగ్ 2.75/5