Puri Jagannadh Slum Dog: డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) లేటెస్ట్ మూవీ ‘పూరీసేతుపతి’ (వర్కింగ్ టైటిల్) (Purisethupathi). ఇందులో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్‌గా సంయుక్త, మరో కీలక పాత్రలో టబు కనిపిస్తారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇటీవలే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ షూటింగ్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు మేకర్స్. ఇదే స్పీడ్‌లో నేడు (ఆదివారం, సెప్టెంబరు 28) బర్త్ డే (Puri Jagannadh Birthday) సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. చెన్నైలో ఓ గ్రాండ్ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో పూరీ సేతుపతి సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయాలనుకున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాకు స్లమ్ డాగ్ (Slum Dog Title)అనే టైటిల్‌ను ఆల్మోస్ట్ ఫిక్స్ చేశారు.ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్‌నే రావాల్సింది. కానీ తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయ పార్టీ ప్రచార సభలో దురదృష్ట వశాత్తు ప్రమాదం జరిగి, 30 మంది చనిపోయారు. దాదాపు వందమంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పూరీ సేతుపతి సినిమా ఈవెంట్‌ను చెన్నైలో క్యాన్సిల్ చేసుకున్నారు మేకర్స్. విజయ్‌సేతుపతి తమిళ హీరో కనుక, మేకర్స్ ఇలా చేసి ఉంటారని ఊహింవచ్చు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్ రావొచ్చు…ఇలా మొత్తానికి పూరీ జగన్నాథ్ ఫ్యాన్స్‌కు, ఆయన బర్త్ డే సర్‌ప్రైజ్ మిస్ అయ్యింది.
Owing to the unfortunate incident in Tamil Nadu, Team #PuriSethupathi has postponed the Title & Teaser Launch Event planned for today.
The team extends its deepest condolences to all the families mourning their loss and stands with them in this moment of tragedy. pic.twitter.com/cCH7VCVBRE
— Puri Connects (@PuriConnects) September 28, 2025