దర్శకుడు రాజమౌళి సినిమాలో ఒక్క అవకాశం కోసం టాప్ స్టార్స్ అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాల తర్వాత రాజమౌళి బాక్సాఫీస్ రేంజ్ మరింతగా పెరిగింది. ఇప్పుడు రాజమౌళి (Director SSRajamouli Next film) సినిమాలో చాన్స్ అంటే ఎగిరి గంతేసీ, సైన్ చేయ డానికి చాలామంది ఆర్టిస్టులు సిద్దంగా ఉన్నారు. అందరు ఆర్టిస్టులు కాదు.
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు (MaheshBabu) హీరోగా ఓ మూవీ సెట్స్‌పై (Rajamouli SSMB29) ఉంది. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌సుకుమారన్‌లు ఇతర లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేస్తున్నారు. ఈ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ మూవీకి ఇంకా చాలామంది ఆర్టిస్టులు కావాల్సి ఉంది. ఈ నేప థ్యంలో తమిళ నటుడు విక్రమ్, హిందీ నటుడు నానా పటేకర్‌ను సంప్రదించారట రాజమౌళి (Rajamouli Movie). కానీ ఈ ఇద్దరు రాజమౌళికి నో చెప్పారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పట్లో విలన్ రోల్ చేయడంలో ఇంట్రెస్ట్ లేని విక్రమ్ (Vikram) ….రాజమౌళికి నో చెప్పారు. ఈ ప్లేస్‌లోకి మరో తమిళ నటుడు మాధ వన్‌ను ఎంపిక చేసుకున్నారట రాజమౌళి. నాగచైతన్య ‘సవ్యసాచి’, అజయ్‌దేవగన్ ‘సైతాన్’, నయనతార ‘ది టెస్ట్’ సినిమాల్లో మాధవన్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసి, మెప్పించారు. దీంతో మరోసారి నెగటివ్ రోల్ చేసేందుకు మాధవన్ మరోసారి నో చెప్పలేదు. ఇక కథలో తన పాత్రకు ప్రాముఖ్యత లేదని, నానా పటేకర్ (NanaPatekar) ఈ సినిమాకు నో చెప్పారనే వార్తలు ఉన్నాయి.
ఇక కొంత గ్యాప్ తర్వాత మహేశ్‌బాబు–రాజమౌళి కాంబినేషన్‌లోని ఈ మూవీ చిత్రీకరణ ఈ వారంలోనే ప్రారంభమైంది. వారణాసిని తలపించే సెట్స్ వేసి, అక్కడి లొకేషన్స్‌లో చిత్రీకరణ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను 2027లో రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్ అని సమాచారం. అయితే కథకు మైథలాజికల్ టచ్ ఉంది. దీంతో వీఎఫ్‌ఎక్స్ పనులు ఏమైనా ఆలస్యం అయితే..2027 చివర్లో ఈ మూవీ విడుదల కావొచ్చు. కేఎల్ నారాయణ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Hi, Neat post. There’s a problem with your site in internet explorer, would test this… IE still is the market leader and a huge portion of people will miss your wonderful writing due to this problem.