please subscribe to Tollywoodhub YouTube channel

బెగ్గర్ కోసం విజయంద్రప్రసాద్ తో పూరీ జగన్నాధ్ అసోసియేషన్

Viswa

Web Stories

పూరీ జగన్నాథ్ కెరీర్ లో ఒక హిట్ మూవీ అయిన ఇస్మార్ట్ శంకర్ రెండో పార్ట్ డబుల్ ఇస్మార్ట్ ప్రీ రీలీజ్ వేడుక లో డైరెక్టర్ పూరీ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు. ‘లైగర్ ‘ ప్లాప్ తర్వాత ప్రముఖ రచయిత విజయంద్ర ప్రసాద్ తనకు ఫోన్ కాల్ చేసారని, స్టోరీ విషయంలో ఏదయినా సాయం కావాలంటే అడగమన్నట్లుగా మాట్లాడరని, కాకపోతేడబుల్ ఇస్మార్ట్ కథ లో ఆయన సాయం  తీసుకోలేదని, కథ పై నమ్మకంతో సినిమాను తానే పూర్తి చేశానని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు.కానీ  డబల్ స్మార్ట్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలయింది. ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ తన తర్వాతి సినిమాను ప్రకటించడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నారు. ఎట్టకేలకు తమిళ హీరో విజయ్ సేతుపతి తో పూరి జగన్నాథ్ సినిమా (BeggarMovie) కన్ఫర్మ్ అయింది. ఈనెల చివర్లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు పూరి జగన్నాథ్. ఈ మూవీలో టబు, కన్నడ నటుడు విజయకుమార్ కీలకపాత్రలో నటించనున్నారు. హైదరాబాద్, చెన్నై లొకేషన్స్ లో షూటింగ్ కోసం ప్రస్తుతం లోకేషన్స్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పూరీ జగన్నాథ్.

 అయితే తాజాగా పూరి జగన్నాథ్… ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి, విజయేంద్ర ప్రసాద్ ను కలవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. విజయ్ సేతుపతితో  తాను చేయనున్న తర్వాతి సినిమా కోసమే విజయేంద్ర ప్రసాద్ ను పూరి జగన్నాథ్ కలిశారట. ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో విజయేంద్రప్రసాద్ సలహాలను పూరి జగన్నాథ్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇది కచ్చితంగా ఈ సినిమాకు ప్లస్ అవుతుందనే చెప్పాలి. ‘బాహుబలి ఆర్ఆర్ఆర్, విక్రమార్కుడు, వంటి ఎన్నో

సూపర్ హిట్ సినిమాలకు విజయేంద్రప్రసాద్ రచయితగా పనిచేశారు. ఇప్పుడు పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ తో ఆయన చేతులు కలపబోతున్నట్లుగా తెలిసింది. తాను పూరి జగన్నాధకు అభిమానినని గతంలోనే విజయేంద్ర ప్రసాద్ చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవల విజయేంద్ర ప్రసాద్ ని కూడా కలిశారు పూరి జగన్నాథ్. మరి వార్తల్లో ఉన్నట్లుగానే పూరి జగన్నాథ్ సినిమాకు విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ సాయం చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.  ఇక ఈ సినిమాకు దగ్గర అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని, ఈ మూవీలో నివేదాథామస్ ఆకాష్ పూరీలు కూడా కీలకపాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అయితే రావాల్సి ఉంది. బ్యానర్ పై పూరి జగన్నాథ్ చార్మి కౌర్ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ ను ప్లాన్ చేశారు మేకర్స్.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi