RRR Documentary: ‘రౌద్రం..రణం..రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్) ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం విడుదలైంది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. డీవీవీ దానయ్య నిర్మించారు. మార్చి 25, 2022లో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. కాగా ఈ సినిమాపై ఓ డాక్యుమెంటరీని ఈ నెలలోనే రిలీజ్‌చేయనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అవుతుందనే ప్రచారం సాగుతోంది. అయితే ‘ఆర్ ఆర్‌ఆర్’ గురించి ఎటువంటి ఆసక్తికర విషయాలు ఇందులో ఉండబోతున్నాయనే చర్చ ఇండస్ట్రీలో ఓ హాట్‌టాపిక్‌గా మారింది.
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో రామ్‌చరణ్ పాత్రకు ఎక్కువ ప్రధాన్యత లభించినట్లుగా ఇప్పటికీ సినీ విమర్శకులు చెప్పుకుంటుంటారు. ఈ విషయంపై డాక్యుమెంటరీలో ఏమైనా ఉంటుందెమో చూడాలి.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్ కనిపిస్తుంది. కానీ ఈ పాత్రకు ముందుగా మరో విదేవీ నటి డైసీ ఎడ్గర్ జోన్స్‌ను ఎంపిక చేశారు. ఈ విషయంపై ఓ క్లారిటీ ఉండొచ్చు.
pushpa2 Collections: హిందీలో టాప్ ప్లేస్‌కి పుష్ప 2 ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా?
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా విడుదల చాలాసార్లు వాయిదా పడింది. ముఖ్యంగా కరోనా సమయం వల్ల ఫిల్మ్ మేకింగ్‌లోనూ ఇబ్బందులు ఎదరైయ్యాయి. ఈ అంశాలు ఈ డాక్యుమెంటరీలో ఎంటా ఉంటాయో చూ డాలి. అలాగే ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా విడుదల వాయిదా పడటం వల్ల ఎన్నో చిన్న సినిమాల రిలీజ్‌లకు ఆటంకం ఏర్పడింది. ఈ అంశాలపై రాజమౌళి ఏ విధంగా స్పందిస్తారనే చర్చ ఇండస్ట్రీలో జరుగుతోంది.
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో సత్యదేవ్ యాక్ట్ చేశారు. కానీ ఎడిటింగ్‌లో సత్యదేవ్ నటించిన సీన్స్ అన్నీ పో యాయి. ఇలా మరికొంతమంది నటీనటులు ఉన్నారు. అంశాలు డాక్యుమెంటరీలో ఉంటాయోమో చూడాలి.
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఈ చిత్రం సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్‌లు ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఈ ఆస్కార్ ప్రయాణం గురించి డాక్యుమెంటరీలో తప్పకఉంటుంది. అలాగే ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ‘ఆర్‌ఆర్‌ఆర్’ను ఎంపికచేయలేదు. ఈ విషయంలో రాజమౌళి నిరుత్సాహ పడ్డారు. ఈ అంశాలపై కూడా స్పందన ఉండొచ్చు.
నాటు నాటు పాటను వియాత్నంలో చిత్రీకరించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ ఇండియాకు తిరిగి రాగానే అక్కడ వార్ మొదలైంది. ఈ అనుభవాలను గురించిన విషయాలు డాక్యుమెంటరీలో ఉండే అవకాశం ఉంది.
ఇలాంటి ఆసక్తికరమైన విషయాలపై ‘ఆర్‌ఆర్‌ఆర్’ డాక్యుమెంటరీ (RRR Documentary) విడుదలైతే, ఆడియన్స్‌కు తప్పక ఎంజాయ్‌బుల్‌గా ఉంటుంది. ఆసక్తికరంగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా టెక్నికల్ అంశాలు బయటకు వస్తే రాబోయే యంగ్ ఫిల్మ్‌మేకర్స్‌కూ ఈ డాక్యుమెంటరీ ఓ గైడెన్స్‌లా ఉపయోగపడ్డొచ్చు.