సమంత ఓ గెస్ట్ రోల్ చేసి, తానే నిర్మించిన ‘శుభం’ సినిమా ఈ మే9న విడుదల కాబోతుంది. సమంత తన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ (Tralalaa movieing pictures) బ్యానర్ నుంచి విడుదల అవుతున్న తొలి సినిమా ఇది. కానీ ఈ బ్యానర్ నుం చి తొలుత ప్రకటించింది మాత్రం ‘మా ఇంటిబంగారం’ సినిమా.. 2024 సమంత బర్త్ డే సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ (Maa inti Bangaram) సినిమాను ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ మూవీపై ఏ క్లారిటీ లేదు. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు కూడా దర్శకుడి పేరును వెల్లడించలేదు.
నిన్న సమంత బర్త్ డే (Samantha birthday). ముందు రోజు…శుభం (Subham) సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. కానీ సమంత బర్త్ డే సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ సినిమా అప్‌డేట్ ఏదీ లేదు. ఆ మాటకొస్తే…సమంత బర్త్ డే రోజున…. ఆమె సినిమాలను గురించి, ఏ ఒక్క అప్‌డేట్ రాకపోవడం, సమంత కెరీర్‌లో ఇదే తొలిసారి కావొచ్చు. ప్రతి ఏడాది సమంత బర్త్ డే అంటే…ఆమె కొత్త సినిమాల అప్‌డేట్స్, ఫస్ట్‌లుక్ పోస్టర్స్, కొత్త సినిమాల హడావిడి ఇలా ఏదో ఒకటి ఉండేది. ఈ సారి బర్త్ డే రోజున మాత్రం సమంత ఫ్యాన్స్‌కు కాస్త నిరాశ ఎదురైంది. ఇక ప్రస్తుతం హిందీలో సమంత ‘రక్త్‌బ్రహ్మాండ్’ అనే ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నారు. కాగా సమంత తెలుగులో నటించే, నెక్ట్స్ మూవీపై ఈ ఏడాదిలో ఓ అప్‌డేట్ రానుందనే టాక్ వినిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.