Sankranthiki Vasthunam Review: సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ

Viswa
3 Min Read
Sankranthiki Vasthunam Review: సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ

Web Stories

కథ

Sankranthiki Vasthunam Review: అమెరికా వ్యాపారవేత్త ఆకెళ్ళ (అవసరాల శ్రీనివాస్ )ను తెలంగాణ సీయం కేశవ (సీనియర్ నరేష్ ) హైదరాబాద్ కు తీసుకువస్తారు. ఆకెళ్ళకు సెక్యూరిటీ ఆఫీసార్ గా  మీనాక్షి  (హీరోయిన్ మీనాక్షి చౌదరి )ని నియమిస్తారు. కానీ ఆకెళ్ళ ను పాండే గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. దీంతో సస్పెండ్ అయిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యాదగిరి దామోదర రాజు అలియాస్ చిన్న రాజు అలియాస్ వైడీ రాజు (వెంకటేష్ ) ను, వెనక్కి తీసుకొని వచ్చే బాధ్యత ను, సీయం ఆదేశాల మేరకు…అతని మాజీ ప్రేయసి మీనాక్షి తీసుకుంటుంది…మరి…రాజు ని ఓపించి, మీనాక్షి… ఆకెళ్ళ ను ఏలా కాపాడుతుంది? తన భర్త రాజు ను స్పెషల్ ఆపరేషన్ కి పంపించేందుకు భాగ్యం (ఐశ్వర్య రాజేష్ ) ఏలా ఒప్పుకుంది? డూప్లికేట్ ఆకెళ్ళ తో సీయం ఏలా మానేజ్ చేశారు? అనేది కథ (Sankranthiki Vasthunam Review)

Ramcharan GameChanger Movie Review: రామ్‌చరణ్‌ గేమ్‌ఛేంజర్‌ మూవీ రివ్యూ

విశ్లేషణ

కిడ్నాప్ క్రైమ్ ఎలిమెంట్ కు…ఫ్యామిలీ డ్రామా, ఓ బ్రేక్ అప్ లవ్ స్టోరీ ని కంబైన్డ్ చేసి కథ ను రెడీ చేసారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. కిడ్నాప్ ఎపిసోడ్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. వై డీ రాజు ఫ్యామిలీ సీన్స్, రాజు ఇంటికీ మీనాక్షి రావడం, ఆకెళ్ళ రెస్క్యూ ఆపరేషన్ కి భాగ్యం ఒప్పుకోవడం తో తొలి భాగం చాలా ఆసక్తి గా ముగుస్తుంది. వై డీ రాజు కొడుకు బుల్లి రాజు తో కామెడీ సీన్స్, హయ్ ఎపిసోడ్ నవ్విస్తాయి. కానీ ఇది అనిల్ మార్క్ కామెడీ. గోదారి గట్టు, మీను సాంగ్స్ విజువల్ గాను, బాగున్నాయి.

Sankrathiki Vasthunnam
Sankrathiki Vasthunnam

 

మరో కిడ్నాప్ డ్రామాతో సెకండ్ హాఫ్ మొదలు అవుతుంది. ఒకట్రెండు సీన్స్ తప్పితే, సెకండ్ హాఫ్ అంతా ఊహకు తగ్గట్టు గానే ఉంటుంది. పొంగల్ బ్లాక్ బస్టర్ సాంగ్.. స్క్రీన్ పై ఫెస్టివ్ వైబ్ ని చూపిస్తుంది. అనిల్ రావిపూడి పాత సినిమాల మాదిరి… లాగిక్స్, లెక్కలు వేయకుండ చూస్తే, సినిమా నచ్చుతుంది. క్లైమాక్స్ ఏదో కొత్త గా ట్రై చేశారు. పర్లేదు అనిపిస్తుంది. మూవ్ ఆన్. బ్రేకప్‌ లవ్‌స్టోరీలకు వెంకటేష్‌ చెప్పిన ‘బ్రేకప్‌’ మూవ్‌ ఆన్‌ సందేశం, గురువులను గౌరవించుకోవాలనే సందేశం కూడా ఫర్వాలేదనిపిస్తాయి.

DaakuMaharaaj Review: డాకుమహారాజ్‌ రివ్యూ

నటీనటుల పెర్ఫార్మెన్స్‌- సాంకేతిక విలువలు

యాదగిరి దామోదర రాజు అలియాస్ చిన్న రాజుగా వెంకటేష్ (Venkatesh) యాక్టింగ్ సూపర్ గా ఉంటుంది. ‘హయ్ ‘ ఎపిసోడ్ లో వెంకీ మార్క్ కామెడీ సీన్స్ బాగుంటాయి. కామెడీ సీన్స్ లో వెంకీ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ ఎప్పటిలానే అలరిస్తుంది.భాగ్యం గా ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh)యాక్టింగ్ చక్కగా చేశారు. తొలి భాగం లో ఐశ్వర్యాకే లీడ్.పో లీస్ ఆఫీసర్ మీనాక్షి గా మీనాక్షి (MennakshiChowdary) యాక్టింగ్ ఓకే. ఓ ఇంట్రడక్షన్ యాక్షన్ ఏపిసోడ్ కూడా ఉంది. ఐశ్వర్య – వెంకటేష్ – మీనాక్షి కాంబినేషన్ సీన్స్ అలరిస్తాయి.వెం కటేష్ మామయ్య గా మురళీధర్ గౌడ్ కామెడీ సీన్స్ బాగున్నాయి.

కాన్స్టేబుల్ మాణిక్యం గాసాయి కుమార్, జైలర్ జార్జీ గా మరాఠి యాక్టర్ ఉపేంద్ర లిమాయే, పంకజ్ పాండే గా పృథ్వి రాజ్, గెస్ట్ రోల్ లో అనంత శ్రీరామ్ (సింగర్ ), క్లైమాక్స్‌లో అనిల్‌రావిపూడి గెస్ట్‌ అప్పీరియన్స్‌, ఆ కెళ్ళ గా అవసరాల శ్రీనివాస్, సీయం గా సినియర్ నరేష్, పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్ గా తమిళ హాస్య నటుడు  విటీవీ గణేష్, డాక్టర్ గా శ్రీనివాస్ రెడ్డి వారి రోల్స్ మేరకు చేశారు. భీమ్స్ సిసి రోలియో మ్యూజిక్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. నిర్మాణ విలువలు దిల్ రాజు బ్యానర్ స్థాయి లో ఉన్నతనంగా ఉన్నాయి. సమీర్ రెడ్డి విజువల్స్ ఓకే. సెకండ్ హాఫ్ లో తమ్మిరాజు కొంచం ఎడిటింగ్ చేయాల్సింది.

Sookshmadarshini ott: మలయాళ బ్లాక్‌బస్టర్‌ సూక్ష్మదర్శని రివ్యూ

బాటమ్ లైన్స్ : కామెడీ, యాక్షన్ సినిమా లో బాగా వర్కౌట్ అయ్యాయి. వెంకీ -ఐశ్వర్య – మీనాక్షిల సన్నివేశాలు  బా గుంటాయి. మెసేజ్ ఈజ్ క్లియర్…సినిమా బాగుంది. ఫ్యామిలీ తొ చూడచ్చు.

రేటింగ్ : 2.75/5

 

 

 

 

 

 

 

 

 

Please Share
7 Comments
Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos