షారుక్‌ఖాన్‌ బాలీవుడ్‌ కింగ్‌

Viswa

Web Stories

ShahRukhKhan king: ‘3 ఇడియట్స్‌’ ఫేమ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌హిరాణితో షారుక్‌ఖాన్‌ చేసిన ‘డంకీ’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఫర్వాలేదనిపించింది. 2023లో వచ్చిన ఈ సినిమా తర్వాత షారుక్‌ఖాన్‌ నెక్ట్స్‌ మూవీపై సరైన స్పష్టత వచ్చింది. ‘పఠాన్‌’తో తనకు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందించిన సిద్దార్థ్‌ ఆనందతో షారుక్‌ఖాన్‌ మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘కింగ్‌’ (ShahRukhKhan king Movie) అనే టైటిల్‌ ఖరారు చేశారు.

ఆదివారం (నవంబరు 2) షారుక్‌ఖాన్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ రిలీజ్‌ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. సూపర్భ్‌ విజువల్స్, షారుక్‌ స్టైలిస్, యాక్షన్‌ టైమింగ్‌తో ‘కింగ్‌’ టైటిల్‌ టీజర్‌ ఆకట్టుకునేలానే ఉంది. ఇక ‘కింగ్‌’ సినిమాలో షారుక్‌ఖాన్‌ (ShahRukhKhan) క్యారెక్టరైజేషన్‌లో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని తెలిసింది.

ఈ ‘కింగ్‌’ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. పోలాండ్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను నిర్వహిం చారు. ఈ పోలాండ్‌ షూటింగ్‌ షెడ్యూల్‌లోనే ఈ చిత్రం హీరోయిన్‌ దీపికా పదుకొనె పాల్గొ న్నారు. అలాగే ఈ ‘కింగ్‌’ సినిమాతో షారుక్‌ఖాన్‌ తనయ సుహానాఖాన్‌ వెండితెరకు నటిగా పరిచయం అవుతున్నారు.వచ్చే ఏడాది ఈ ‘కింగ్‌’ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. మరోవైపు కింగ్‌ సినిమా కోసం ఆరోసారి కలిసి నటిస్తున్నారు షారుక్‌ఖాన్‌ అండ్‌ దీపికా పదుకొనె.

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos