please subscribe to Tollywoodhub YouTube channel

ఒకే ఆఫీసులో ఎక్స్‌ లవర్‌…ప్రజెంట్‌ లవర్‌..!

Viswa

Web Stories

Sharwanand Nari Nari Naduma Murari: శర్వానంద్‌ (Sharwanand) హీరోగా నటించిన సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ (Nari Nari Naduma Murari). ఈ చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్స్‌గా నటించారు. సంపత్‌రాజ్, సత్య, సునీల్, ‘వెన్నెల’ కిశోర్‌ సీనియర్‌ వీకే నరేశ్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రామ్‌ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకుడు. అనిల్‌ సుంకర, రామబ్రహ్మాం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది స్టార్టింగ్‌లోనే రిలీజ్‌ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న (Nari Nari Naduma Murari Release date) సాయంత్రం ఫస్ట్‌ షో నుంచి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. పెళ్లికూతుర్ని తీసుకుని రావడానికి వెళ్తున్నాను..(శర్వానంద్‌)
భయ్యా..లవ్‌ మేటరా..(సత్య)
అవును..(శర్వానంద్‌)

నా కుతూర్ని నీకు ఇచ్చి పెళ్లిచేయాలంటే నాకు నీ గురించి, నీ లవ్‌ గురించి బాగా తెలియాలి
‘చాలా క్లోజ్‌గా ఉన్నారు’,

‘మేం పెళ్లి చేసుకోబోతున్నామ్‌..మేడమ్‌’,
‘లవ్‌ ఆర్‌ ఆరేంజ్డ్‌ మ్యారేజ్‌’,
‘లవ్‌ మ్యారేజ్‌ మేడమ్‌’,
‘లైఫ్‌లో నన్ను తప్ప ఎవర్నీ లవ్‌ చేయనన్నావ్‌ కదరా’,
‘ఏం సుడిగాడివి రా నువ్వు..ఒకే ఆఫీసులో ఎక్స్, ప్రజెంట్‌..’,
‘రాజాలా పెంచాను రా, ఇలా రోజూ ముందు కూర్చుంటావ్‌ అనికోలేదు..’, ‘నాన్న ఊరుకో..’,
ఈ తరహా సంభాషణలు ఈ చిత్రం టీజర్‌లో ఉన్నాయి.

కథ రిత్యా ఈ సినిమాలో..హీరో కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ అమ్మాయితో బ్రేకప్‌ అవుతుంది. ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో మరో అమ్మాయిని ప్రేమిస్తాడు హీరో. అయితే హీరో ఫస్ట్‌ ప్రేమించిన అమ్మాయి, హీరో వర్క్‌ చేస్తున్న ఆఫీస్‌లో, అతని టీమ్‌ లీడర్‌గా వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? అన్న నాటకీయ పరిణామాల నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాకు విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇటీవల విజయం సాధించిన ‘సామజవరగన’ సినిమాకు పనిచేసిన రైటర్‌ నందు, భాను భోగవరపు (రవితేజ మాస్‌ జాతర దర్శకుడు), దర్శకుడు రామ్‌అబ్బరాజు..కలిసి మళ్లీ ‘నారి నారి నడుమ మురారి’ సినిమాకు పనిచేశారు. మరి..ఈ సినిమా రిజల్ట్‌ ఎలా ఉంటుందో చూడాలి.

సంపూర్ణేష్‌బాబు ..ది ప్యారడైజ్‌ బిర్యాని

జేమ్స్‌ కామెరూన్‌ ‘అవతార్‌ 3’ రివ్యూ

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi