Songs: తెలుగు సినిమా అంటే కమర్షియల్ ఫార్మాట్. ఆరు పాటులు, నాలుగు ఫైట్స్ ఉంటాలని ఆడియన్స్ కోరుకుంటున్నారని హీరోలు, దర్శక–నిర్మాతలు ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నారు. కానీ ఆడియన్స్ అభిరుచులు పూర్తిగా మారిపోయాయి. గ్లోబల్ కంటెంట్‌కు దగ్గరువుతున్న ఆడియన్స్, కొత్తదనం కోసం ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగం గానే సినిమా నిడివి ఎక్కువగా ఉంటే ఆడియన్స్ థియేటర్స్‌లో బోర్ ఫీలవుతున్నారు.
ఈ నిడివిని తగ్గించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఆయా చిత్రయూనిట్ సభ్యులు. అయితే ముఖ్యంగా పాటల్నే సినిమాల్లో నుంచి కట్ చేస్తున్నారు. రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్’లోని ‘నానా హైరానా’ పాట ఉంది. ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజైన తొలిరోజు ఈ పాట సినిమాలో కనిపించలేదు. ఆ తర్వాత యాడ్ చేశారు. ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో ‘దావుదీ..’పాటను తీసేశారు. మళ్లీ ఆ తర్వాత యాడ్ చేశారు.
కానీ..ఇప్పుడు ఈ ట్రెండ్ కూడ పోయింది. మొత్తానికి పాటల్నే తీసేస్తున్నారు. మళ్లీ యాడ్ చేసే ఉద్దేశం కూడ మేకర్స్ లేనట్లుగా తెలుస్తోంది. ఉదాహరణకు నాగార్జున– ధనుష్–రష్మికలు యాక్ట్ చేసిన ‘కుబేర’ సినిమాలో రష్మికపై ఓ సాంగ్ ఉంది. కానీ ఈ పాట థియేటర్స్‌లో కనిపించలేదు. ఆ తర్వాత సినిమాలోనూ యాడ్ చేయలేదు.

ఇప్పుడు ‘మిరాయ్’ సినిమాలో ఏకంగా రెండు పాటల్నీ ఏత్తేశారు. మంచి బజ్ క్రియేట్ చేసిన ‘వైబ్ ఉందిలే పిల్లా…’, నిధీ అగర్వాల్ చేసిన ఓ స్పెషల్ సాంగ్‌ను తీసేశారు. ఈ రెండు పాటలు లేకుండానే, ‘మిరాయ్’ సినిమా నిడివి 2 గంటల 48 నిమిషాలు ఉంది. ఈ రెండు పాటల్నీ కలిపితే, నిడివి మూడు గంటలకు పెరిగిపో తుందని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఏదీ ఏమైనా…సినిమాలో ఈ పాటల ప్రధాన్యాన్ని తగ్గిస్తుండటం అనేది గాయని, గాయకులు, మ్యూజిక్‌డైరెక్టర్స్ కెరీర్‌లకు కాస్త ఇబ్బందే మరి.
తేజ సజ్జా ‘మిరాయ్’ సినిమా రివ్యూ
బెల్లంకొండ సాయిశ్రీనివాస్- అనుపమల కిష్కింధపురి సినిమా రివ్యూ