హే బల్‌వంత్‌ సినిమా రివ్యూ

Viswa

Web Stories

రీసెంట్‌ టైమ్స్‌లో సుహాస్‌ హీరోగా వచ్చిన ‘గొర్రెపురాణం, ఓ భామ అయ్యో రామ, జనకయితే గనక’….వంటి సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద విఫలం అయ్యాయి. తాజాగా సుహాస్‌ హీరోగా చేసిన సినిమా ‘హే బల్‌వంత్‌’. అంబాజీపేటమ్యారేజీబ్యాండు సినిమా తర్వాత సుహాస్‌, శివానీ నాగారం హీరోహీరోయిన్లుగా చేసిన సినిమా ఇది. వీకే నరేష్‌ కీలక పాత్ర ధారి (Hey Balwanth review). తొలుత ఈ సినిమాకు ‘హే భగవాన్‌’ అనే టైటిల్‌ను అనుకున్నా, ఆ తర్వాత ‘హే బల్‌వంత్‌’ అనే పేరుతో రిలీజ్‌ చేశారు. మరి..సుహాస్‌కు ‘హే బల్‌వంత్‌’ సినిమాతో హిట్‌ వచ్చిందా? రివ్యూలో చదివేయండి (Hey Balwanth movie review)

సినిమా :హే బల్‌వంత్‌ (Hey BalWanth Movie Review)
తారాగణం: సుహాస్, శివాని నగరం, వీకే నరేష్, సుదర్శన్, స్రవంతి, అన్నపూర్ణమ్మ
దర్శకత్వం: గోపీ అచ్చర
నిర్మాత: బి నరేంద్ర రెడ్డి
బ్యానర్: త్రిశూల్ విజనరీ స్టూడియోస్
డీవోపీ: మహి రెడ్డి పండుగల
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటర్: విప్లవ్ నిషాదం

విడుదల తేదీ: 20-02-202 (Hey Balwanth Movie Release date)

రన్‌టైమ్‌: 2 గంటల 14 నిమిషాలు (Hey Balwanth Movie runTime)
రేటింగ్‌: 2.5/5 (HeyBalwanthMovie Review and rating)

కథ

రామ్‌బల్‌వంత్‌ (సీనియర్‌ నటుడు వీకే నరేష్‌) కొడుకు కృష్ణ బల్‌వంత్‌(సుహాస్). తన తండ్రి ఓ పెద్ద వ్యాపారవేత్త అనుకుంటాడు కృష్ణ(సుహాస్). తను పెద్దాయ్యాక తండ్రి చేసే వ్యాపారాన్ని టేకోవర్‌ చేయాలన్నది కృష్ణ ప్లాన్‌. కానీ తన బిజినెస్‌లోకి కృష్ణ ఎంటర్‌కావడానికే రామ్‌ బల్‌వంత్‌ ఒప్పుకోడు. దీంతో తనలోని వ్యాపారవేత్త లక్షణాలను తండ్రికి చూపించాలనుకుని, మిత్ర అనే అమ్మాయి రన్‌ చేసే ఓ ఎన్‌జీవోలో బిజినెస్‌ కన్సల్టెంట్‌గా చేరతాడు కృష్ణ. ఈ జాబ్‌ జర్నీలో భాగంగానే మిత్రను ప్రేమిస్తాడు. మరోవైపు రామ్‌బల్‌వంత్‌కు గుండెపోటు వచ్చి, హాస్పిటల్‌లో జాయిన్‌ అవుతాడు. ఇదే అదునుగా కృష్ణ తన తండ్రి చేసే బిజినెస్‌ను టేకోవర్‌ చేద్దామని, తండ్రి బిజినెస్‌ ఏంటో తెలుసుకుని షాక్‌ అవుతాడు. తండ్రిపై ద్వేషం పెంచుకుంటాడు. మరి..నిజంగా రామ్‌ చేసే వ్యాపారం ఏమిటి? ఈ తండ్రీకొడుకులు మళ్లీ ఒకటవుతారా? మధ్యలో పీవీపీ (హర్షవర్థన్‌)-దుర్గారావు (అజయ్‌ఘోష్‌)ల రాజకీయ దూమారం ఏమిటి? యువన్‌ (వెన్నెల కిషోర్‌)-చంప (యాంకర్‌ స్రవంతి)ల స్టోరీ ఏంటి? కృష్ణ ఫ్రెండ్‌ బంక (సుదర్శన్‌), అతనికి ఏ విధంగా హెల్ప్‌ అయ్యాడు? అన్నది మిగిలిన సినిమాలోని కథాంశాలు (Hey Balwanth movie review)

.

Hero Suhas HeyBalwanthreview Review
Hero Suhas HeyBalwanthreview Review

విశ్లేషణ

‘హే బల్‌వంత్‌’ సినిమాలో నరేశ్‌ చేసే బిజినెస్‌ ఏంటో చెప్పడంటూ, మేకర్స్‌ ఈ సినిమాను తెలివిగా భలే ప్రమోట్‌ చేశారు. కథ కూడ ఈ బిజినెస్‌ చుట్టూనే తిరుగుతుంది. ఈ బిజినెస్‌ ఏంటో తెలుసుకోవాలని క్రిష్ణ పడే పాట్లు, చేసే అల్లరి చేష్టలు, మాటలు ఆడియన్స్‌కు నవ్వు వస్తుంది. క్రిష్ణకు తోడుగా ఉండే బంక పంచ్‌లు కూడా ఆడియన్స్‌కు కితకితలు పెడతాయి.ఈ నవ్వులకు తోడు ప్రేమకథతో, సినిమా తొలిభాగం సరదాగా సాగిపోతుంటుంది. ఇంట్రవెల్‌కి అదిరిపోయే ట్విస్ట్‌ ఉంటుంది. ప్రీ ఇంట్రవెల్‌, ఇంట్రవెల్‌ సీన్స్‌ ఆడియన్స్‌ను నవ్విస్తాయి.

HeyBalawanth Movie working Still
HeyBalawanth Movie working Still

సెకండాఫ్‌లో ఓ రాజకీయనాయకుడు ఇంట్లో హీరో, అతని మిత్రమండలి గ్యాంగ్‌ చేసే కామెడీ హంగామా ఫర్వాలేదు. అక్కడక్కడ కాస్త డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ ఉన్నాయి. కానీ రామ్‌బల్‌వంత్‌ ఏమోషనల్‌ సీన్స్‌తో సినిమా క్లైమాక్స్‌ వైపు సాగుతుంది. ఎందుకో కామెడీ వర్కౌట్‌ అయినట్లుగా ఈ చిత్రంలోని ఎమోషన్‌ వర్కౌట్‌ కాలేదనిపిస్తుంది. రామ్‌బల్‌వంత్‌చేసే బిజినెస్‌ను జస్టిఫై చేయడంతో దర్శకుడు సరైన పంథాను ఎంచుకోలేదెమో అనిపిస్తుంది. కథకు ఎన్ని కారణాలు ఉన్న ఇలాంటి ఓ బిజినెస్‌లో పాజిటివ్‌ కోణాన్ని వెతకడం అన్నదిఎంత వరకు కరెక్ట్‌ అనేది దర్శకుడికే తెలియాలి. ఊహించదగ్గ క్లైమాక్స్‌, కొన్ని రోటీన్‌ సీన్స్‌ ఆడియన్స్‌కు మరోసారి తెరపై కనిస్తాయి.

నటీనటులు-సాంకేతిక నిపుణుల పెర్ఫార్మెన్స్‌

యాక్టర్‌గా సుహాస్‌ ( Hey Balwanth hero Suhas) ఎప్పట్లానే చేశాడు. కామెడీని కాస్త ఇంప్రూవ్‌ చేశాడు. శివానీ నాగారం ( Hey Balwanth Heroine SIvani nagaram) కూడా కామెడీ టైమింగ్‌ను కాస్త మెరుగుపరచుకున్నారు ఈ సినిమాతో. ఇక వీకే నరేశ్‌ ఈ సినిమాకు మెయిన్‌ పిల్లర్‌. తనదైన మార్క్‌ కామెడీ, ఎమోషన్‌ సీన్స్‌లో ఎక్స్‌పీరియన్స్‌ను చూపించారు. ఓ స్ఫూప్‌ సీన్‌ ఇందుకు ఓ ఎగ్జాంపుల్‌. స్రవంతి, వెన్నెల కిషోర్‌, హర్షవర్థన్‌, అజయ్‌ఘోష్‌, అన్నపూర్ణమ్మలు వారి వారి పాత్రల పరిధి మేరకు యాక్ట్‌ చేశారు. బాబు మోహన్‌ అతిథిగా మెరివారు (Hey Balwanth Movie cast and Crew)

. డైరెక్టర్‌ రామ్‌ మంచి స్క్రీన్‌ ప్లే రాసుకున్నాడు. కామెడీ ట్రాక్‌ను హైలెట్‌ చేయాలని, ముఖ్యమైన ఎమోషన్‌ ట్రాక్‌ డోస్‌ను తగ్గించి, కథకు ఓ లోపం పెట్టాడు. ఆర్‌ఆర్‌, విజువల్స్‌ బాగున్నాయి. పాటలు యావరేజ్‌. నిర్మాణ విలువలు ఫర్వాలేదు

HeyBalwanthMovieReview74

సరదాగా నవ్వుకోడానికి ఓ సారి ఈ సినిమా చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కొన్ని డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ ఇబ్బంది పెట్టవచ్చెమో. కథలో ఎమోషన్‌ కూడ వర్కౌట్‌ అయ్యుంటే బాగుండేది. రోటీన్‌ క్లైమాక్స్‌ కాకుండ ఉంటే బాగుండేది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi Shivani Nagaram