please subscribe to Tollywoodhub YouTube channel

Pradeep Ranganathan movies: నెలలో రెండు సినిమాలు డ్యూడ్‌!

Viswa
2 Min Read
Hero Pradeep Ranganathan movies 2025

Web Stories

తమిళ యువ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan) తెలుగు ఆడియన్స్‌కు పరిచయమే. ప్రదీప్‌ హీరోగా చేసిన ‘లవ్‌ టుడే (love today), రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’ సినిమాలు తెలుగులో సూపర్‌హిట్స్‌గా (Pradeep Ranganathan movies) నిలిచాయి. ఈ రెండు సినిమాలు కూడా తమిళంలో వందకోట్ల రూపాయాల క్లబ్‌లో చేరిన సినిమాలే. అంతేనా..ప్రదీప్‌ రంగనాథన్‌ డైరెక్షన్‌లోని తొలి మూవీ ‘కోమలి’ కూడా హిట్‌ ఫిల్మ్‌యే. ఇలా మంచి సక్సెస్‌ ట్రాక్‌ ఉంది ప్రదీప్‌ రంగనాథన్‌కు.

Pradeep Ranganadhan Dude:తెలుగులో డ్యూడ్‌

Pradeep Ranganadhan Dude Movie
Pradeep Ranganadhan Dude Movie

అలాంటి ప్రదీప్‌ రంగనాథన్‌ నెక్ట్స్‌ మూవీస్‌గా ‘డ్యూడ్, లైక్‌ (ఎల్‌ఐకే) చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ రెండు చిత్రాలు నెల రోజుల గ్యాప్‌లో రిలీజ్‌ కానుండంటం విశేషం. ప్రదీప్‌ రంగనాథన్‌ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చేస్తున్న మూవీ ‘డ్యూడ్‌ (Dude)’. మమితా బైజు హీరోయిన్‌. తెలుగులో ప్రదీప్‌కు తొలి చిత్రం ‘డ్యూడ్‌’. ఈ మూవీని తెలుగు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కీర్తీశ్వరన్‌ ఈ సినిమాకు దర్శకుడు. లేటెస్ట్‌గా ‘డ్యూడ్‌’ సినిమాను ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ అధి కారికంగా ప్రకటించారు.

PradeepRanganadhan LIK:సెప్టెంబరులో లైక్‌

కానీ ఈ సినిమా కంటే ముందే..ప్రదీప్‌ రంగనాథన్, కృతీశెట్టి (Krithi Shetty) హీరోయిన్స్‌గా చేసిన ‘లైక్‌’ (ఎల్‌ఐకే) (LIK)మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. విఘ్నేష్‌శివన్‌ ఈ యూత్‌పుల్‌ డ్రామాకు దర్శకుడు. సెవెన్‌ స్టూడియోస్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. లేటెస్ట్‌గా ఈ మూవీని సెప్టెంబరు 18న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. ఇలా..నెల రోజుల గ్యాప్‌లో ప్రదీప్‌ రంగనాథన్‌ సినిమాలు రెండు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. తమిళ సినిమా డ్రాగన్‌ (తెలుగులో రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌) , లైక్, డ్యూడ్‌..ఇలా ఈ ఏడాది ప్రదీప్‌ రంగనాథన్‌కు చెందిన సినిమాలు మూడు రిలీజ్‌ కానుండటం మరో విశేషం.

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi