బాలకృష్ణ ‘అఖండ 2’, పవన్‌కల్యాణ్ ‘ఓజీ’…ఈ రెండు సినిమాలు ఈ దసరాకి సెప్టెంబరు 25న థియేటర్స్‌లో రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి (Akhanda2 Vs OG). ఈ రెండు చిత్రాలూ సెప్టెంబరు 25నే రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాల్లో తొలుత ‘అఖండ 2’ సినిమాను సెప్టెంబరు 25న రిలీజ్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ‘ఓజీ’ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది.
ఓ దశలో ‘అఖండ 2’ సినిమా డిసెంబరు 5న విడుదల అవుతుందెమోనన్న టాక్ వినిపించింది. ఎందుకంటే…‘అఖండ’ సినిమా డిసెంబరు 3, 2021లో విడుదలైంది. ఆ డిసెంబరు సెంటి మెంట్‌తో ‘అఖండ’ సినిమాను డిసెంబరులో ఏమైనా రిలీజ్ చేస్తున్నారెమో అనుకున్నారు ఇండస్ట్రీ వాసులు. ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్ అన్నారు. ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద మరోసారి బాలయ్య వర్సెస్ చిరంజీవి ఉంటుందనుకున్నారు. కానీ ఇవేవి నిజం కాలేదు. ‘అఖండ 2’ (Akhanda2 Release)మూవీ మేకర్స్ దసరా సందర్భంగానే రిలీజ్ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ‘అఖండ 2’ వర్సెస్ ఓజీ అన్నట్లుగా మారిపోయింది.
‘అఖండ 2’ సినిమాకు కాస్త మైథలాజికల్ టచ్ ఉంది కాబట్టి, ఈ సినిమాను దసరా పండగ సందర్భంగా రిలీజ్ చేస్తే, ఈ సినిమాకు కచ్చితంగా ఫ్లస్ అవుతుంది. పైగా ‘అఖండ 2’ సిని మాను హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు. మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలూ ఏ మాత్రం నార్త్ ఇండియన్స్‌కు కనెక్ట్ అయినా..బాక్సాఫీస్ లెక్కలు మరో లెవల్లో ఉంటా యి. ఉదాహరణకు ‘కార్తీకేయ 2, కాంతార’ సినిమాలను చెప్పుకోవచ్చు. అందుకే ఈ దసరా నవరాత్రులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ‘అఖండ 2’ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు కొంతకాలం గ్యాప్ తర్వాత పవన్‌కల్యాణ్ నుంచి ‘ఓజీ’ తరహా గ్యాంగ్‌స్టర్ డ్రామా రాబోతుంది. ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. సాహో వంటి సినిమాను తీసిన సుజిత్ ఈ సినిమాకు దర్శకుడు. పైగా ఇప్పటివరకు బయటకు వచ్చిన ఓజీ కంటెంట్ ఆడి యన్స్‌కు బాగా ఎక్కేసింది. పైగా ఓజీ సినిమా ముంబై బ్యాక్‌డ్రాప్. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా, నార్త్‌లో ఓజీ బాక్సాఫీస్ లెక్కలు కొత్తవి వస్తాయి. ఈ తరుణంలో పవన్‌కల్యాణ్ ‘ఓజీ’ (OG Release) టీమ్ కూడా దసరా రిలీజ్ నుంచి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదంటోంది. ఇలా ఎవరి కారణాలు వారికి ఉన్నాయి.
మరి…బాక్సాఫీస్ వద్ద పవన్‌కల్యాణ్‌ది పైచేయి అవుతుందో లేదా…బాలకృష్ణది పై చేయి అవుతుందో చూడాలి.