కథ
Upendra’s UI The Movie Review: దర్శకుడు ఉపేంద్ర తీసిన ‘యూఐ’ సినిమా చూసి, ఆడియన్స్ వింత వింతగా ప్రయత్నిస్తుంటారు. ఈ సినిమాను బ్యాన్ చేయాలని ధర్నాలు జరుగుతుంటాయి. మరోవైపు సినిమా బాగుందంటూ సెలబ్రేషన్స్. ఈ తరుణంలో ఈ సినిమాను రివ్వూ్య చేయాలని ప్రముఖ విమర్శకుడు కిరణ్ ఆదర్శ్ (మురళీ శర్మ) అనుకుంటాడు. కిరణ్ ఆదర్స్ నాలుగు సార్లు చూసిన కూడా రివ్యూ రాయలేకపోతాడు. దీంతో అసలు..ఉపేంద్ర ఇలాంటి సినిమాను ఎలా తీశాడో రీసెర్చ్ చేయాలని అనుకుని, ఉపేంద్ర స్క్రిప్ట్‌ను రెడీ చేసిన ప్లేస్‌కి వెళ్తాడు. అక్కడ ఉపేంద్ర స్క్రిప్ట్‌లోని క్యారెక్టర్స్ సత్య, కల్కిభగవాన్‌లు ఉంటాయి (Upendra’s UI The Movie Review)
AkhilAkkineni: అఖిల్ చేయాల్సిన వందకోట్ల సినిమా క్యాన్సిల్?
సత్య, కల్కి భగవాన్ (ఉపేంద్ర ద్విపాత్రాభినయం చేశారు) కవలపిల్లలు. సమసమాజస్థాపన కోసం సత్య ఎంతో కష్టపడుతుంటాడు. మరోవైపు కల్కిభగవాన్ మాత్రం సమాజంపై ప్రతీకారం తీర్చు కోవాలను కుంటాడు. సత్యను ఇన్నర్ వరల్డ్‌లో బంధించి, సత్యగా కల్కిభగవాన్ వెళ్తాడు. ఇందు కోసం తన పెంపుడు తండ్రి వీరబ్రహ్మాంద్రస్వామి (అచ్యుత్‌కుమార్), వామనరావు (రవిశంకర్)లను వాడుకుని, తానే అధికారంలోకి వస్తాడు. మరోవైపు బంధించబడ్డ సత్య ఎలాగో తప్పించుకుని వస్తాడు. అప్పుడు సత్య, భగవాన్‌ల మధ్య ఏం జరిగింది? అసలు….అసలు తాను రాసుకున్న ఈ ‘సత్య–కల్కిభగవాన్’ల స్క్రిప్ట్‌తో ఉపేంద్ర ఎందుకు సినిమా తీయలేకపోయాడు? రివ్యూ క్రిటిక్ కిరణ్ ఆదర్శ్‌కు తెలిసిన అసలు నిజమేంటి? అన్నది ఈ సినిమా కథనం.
విశ్లేషణ
ఉపేంద్ర సినిమాలు డిఫరెంట్‌గా ఉంటాయి. టేకింగ్, మేకింగ్‌లోనే ఉపేంద్ర డిఫరెంట్ అని రెండు దశాబ్దాల క్రితమే ఆడియన్స్ డిసైడ్ చేశారు. ఈ నేపథ్యంలో దాదాపు ఓ పదేళ్ల తర్వాత ఉపేంద్ర దర్శకత్వంలో మరో సినిమా అనగానే ఆడియన్స్‌లో క్యూరియాసిటీ మొదలైంది. ‘యూఐ’ టైటిల్‌తో అది రెట్టింపు అయ్యింది.
మీరు తెలివైనవారు అయితే…ఇప్పుడు థియేటర్ నుంచి బయటకు వెళ్లండి
మీరు మూర్ఖులైతే పూర్తి సినిమా చూడండి…
తెలివైన వాళ్లు మూర్ఖుల్లా కనిపిస్తారు…
ముర్ఖులు తెలివైనవారిలా నటిస్తారు…
ఈ డైలాగ్స్ స్క్రీన్‌పై UI The Movie స్టార్టింగ్‌లోనే పడతాయి. ఓ డిఫరెంట్‌ను సినిమాను చేసేందుకు సిద్ధంగా ఉండాలనుకున్నట్టుగా ఉపేంద్ర ఆడియన్స్‌ను ముందుగానే ప్రిపేర్ అవ్వమని చెప్పినట్లుగా ఉంది.
Mufasa: The Lion King Review: ముఫాసా: ది లయన్‌కింగ్ రివ్యూ
అసలు..కథగా విశ్లేషించుకోవాలనుకుంటే కథలో ఏమీ అంతగా లేదు. కొన్ని సన్నివేశాలను కలుపుకుంటూ, సమాజంపై సైకలాజికల్ సెటైరికల్ మూవీ తీశాడు ఉపేంద్ర. ప్రకృతి నాశనం చేయడం, జేబు దొంగ పెద్ద రాజకీయ నాయకుడు కావడం, దొంగబాబాలకు ప్రజలు నీరాజనం కావడం, సెలబ్రిటీ గాసిప్‌లకు ప్రజలు టైమ్ ఎక్కువ కేటాయించడం, టెక్నాలజీ– సాంకేతికత– సోషల్‌మీడియా– రియాలిటీ షో…ఇలాంటి వాటికి ప్రజలు బానిసలై పోవడం…ఇలాంటి అంశాలనే సత్య, కల్కిభగవాన్‌ల పాత్రలో చెప్పే ప్రయత్నం చేశాడు ఉపేంద్ర. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఈ సినిమాను ఆడియన్స్ డీకోడ్ చేస్తారనే చెప్పుకొచ్చారు ఉపేంద్ర. రిలేట్ చేసుకుంటే, చాలా సన్నివేశాలు నేటి ఆధునిక ఆధునాతన జీవన విధానాన్ని, జీవనశైలిని ప్రతిబిం భిస్తుంది సినిమా. సత్య పాత్రను ప్రజలే చపడం అనేది..మార్పులకు ప్రజలు సిద్ధంగా లేరని, కులం–మతం
వంటివి ప్రజలను అనాలోచితపరులుగా మార్చేస్తాయని కూడా పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశాడు ఉపేంద్ర.
ఉపేంద్ర ఓ రాజకీయపార్టీ పెట్టి విఫలమైయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ ఫిలాసఫీలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి ఏమో అనిపిస్తుం టుంది. ఎందుకంటే..వీలైనప్పుడల్లా రాజకీయ నాయకులపై సెటైర్స్ వేశారు. సైకలాజికల్ థ్రిల్లర్ కాబట్టి, రిలేట్ చేసుకున్న వాళ్లకు రిలేట్ అయ్యే మరికొన్ని అంశాలు దొరకవచ్చు.
నటీనటులు
దర్శకుడి, నటుడిగా ‘యూఐ’ సినిమాలో ఉపేంద్ర ఏకాఛత్రాదిపత్యం కనిపిస్తుంది. సత్య, కల్కిభగవాన్ పాత్రల్లో మంచి వేరియేషన్ చూపించాడు ఉపేంద్ర. ఓపెనింగ్ సీక్వెన్స్‌లు, క్లైమాక్స్, ఇంట్రవెల్ సీక్వెన్స్‌లు బాగుంటాయి. సత్య పెంపుడు తండ్రిగా అచ్యూత్‌కుమార్, రాజకీయనాయకుడు వామనరావుగా రవిశంకర్‌లకు కాస్త గుర్తింపు ఉన్న పాత్రలు దొరికాయి. హీరోయిన్‌గా రీష్మా కనిపిస్తారు. కథలో ప్రధాన్యత ఉండదు.. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. సినిమా నిడివి రెండుగంటల పది నిమిషాలే. చాలా తక్కవు. కానీ ఇంకో పదినిమిషాలను ఎడిట్ చేసుకునే స్కోప్ ఉంది.
డిఫరెంట్ సినిమాలు చూడాలనుకుంటే ఆడియన్స్‌కు యూఐ ఓ మంచి చాయిప్. సైకలాజికల్ కన్‌ఫ్యూజన్ ఉన్నా…ఫోకస్ పెడితే…సినిమాలోని కొన్ని సన్నివేశాలకైనా కనెక్ట్ అయ్యే స్కోప్ స్క్రిప్ట్‌లో ఉంది.
రేటింగ్ 2.75/5