హ్యాపీమ్యారీడ్‌ లైఫ్‌…విరోష్‌

Viswa
1 Min Read

Web Stories

ViRosh Celebrations: టాలీవుడ్‌ కపుల్స్‌లో ప్రజెంట్‌ సందడంతా ‘విరోష్‌’దే. అదేనండీ..విజయ్‌దేవరకొండ, రష్మికా మందన్నా. ఈ ఏడాది ఫిబ్రవరి 26న విజయ్, రష్మికల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే విరోష్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టుకముందే, ‘రణబాలి’ సినిమా సెట్స్‌పై ఉంది. గతంలో వీరద్దరూ ‘గీతగోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలు చేశారు.

ఇక పెళ్లి తర్వాత విరోష్‌ జంట తొలిసారిగా ‘రణబాలి’ సినిమా షూటింగ్‌లో కలిసి పాల్గొన్నారు. పెళ్లి తర్వా త ‘రణబాలి’ అండ్‌ టీమ్‌ అనంతపురంలో ఓ షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తి చేశారు. అక్కడ కేవలం విజయ్‌ దేవరకొండకు సంబంధించిన సీన్స్‌ను గురించిన సన్నివేశాలనే చిత్రీకరించారు. ఇప్పుడు విజయ్‌ – రష్మికల కాంబినేషన్‌లోని సినిమాల చిత్రీకరణను స్టార్ట్‌ చేశారు. ఇందులో రణబాలి టైటిల్‌ రోల్‌లో విజయ్‌ నటిస్తు ండగా, జయమ్మ పాత్రలో రష్మికా మందన్నా నటిస్తున్నారు. విలన్‌గా మమ్మీ సినిమా ఫేమ్‌ ఆర్నాల్డ్‌ వోస్లూ కనిపిస్తారు.

19వ శతాబ్ధం నేపథ్యంతో 1854 నుంచి 1878 వరకు రాయలసీమ ప్రాంతంలో బ్రటిష్‌ పరిపాలనా కాలంలో జరిగిన కొన్ని చారిత్రాత్మక సంఘటనల ఆధారంగా, ఈ సినిమా ఉంటుంది. గుల్షన్‌కుమార్, భూషణ్‌కుమార్‌ల సమర్పణలో మైత్రీమూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్‌ సంకృత్యాన్‌ ఈ మూవీకి దర్శకుడు. అజయ్‌–అతుల్‌ ద్వయం సంగీతం అందిస్తున్నారు. ‘రణబాలి’ సినిమాను ఈ ఏడాది సెప్టెంబరు 11న రిలీజ్‌కు ప్లాన్‌ చేశారు.

Please Share
Share This Article
4 Comments
Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu