Ram Charan Successful Wrist Surgery: హీరో రామ్‌చరణ్ మణికట్టుకు విజయవంతంగా శ్రస్త్రచికిత్స పూర్తయింది. కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్, అమెరికాకు చెందిన ప్రముఖ డాక్టర్ అలెహాండ్రో బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజల సారథ్యంలోని వైద్యుల బృందం పర్యవేక్షణలో రామ్ చరణ్‌కు శ్రస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది. ఇక ఈ సర్జరీ జరిగిన కారణంగా దాదాపు రెండు నెలలు రామ్‌చరణ్ విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత ఫిజియోథెరపీ తీసుకోవాల్సి ఉంది.ఇక రామ్‌చరణ్ గత చిత్రం ‘పెద్ది’ సినిమా చిత్రీకరణలో భాగంగా, ఆయన గాయపడ్డ సంగతి తెలిసిందే.
డ్రాగన్ సినిమా కోసం ఓవర్ రిస్క్ చేస్తున్న ఎన్టీఆర్?
మరోవైపు ‘రంగస్థలం’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా మరో సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాను ఇప్పటికే ప్రకటించి, ఏడాదిన్నర అవుతున్న ఇంకా సెట్స్ వెళ్లలేదు. ఇంకా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్‌కు శ్రస్త్ర చికిత్స జరిగిన కారణంగా, ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి మరింత సమయం పట్టేలా ఉంది. సుకుమార్ ఓ సినిమాను తీసేందుకు చాలా సమయం తీసుకుంటారు. ఎడిట్ టేబుల్ మీదనే ఎక్కువ సమ యం స్పెండ్ చేస్తుంటారు. ఇవన్నీ చూస్తుంటే…రామ్‌చరణ్ కెరీర్‌లోని ఈ 17వ సినిమా 2027లో రిలీజ్ అయ్యే అవకాశాలు లేనట్లే అని తెలుస్తోంది.