Chennai Love Story Review: యువ నటుడిగా కిరణ్ అబ్బవరం తెలుగు చిత్రపరిశ్రమలో రాణిస్తున్నాడు. ‘క’ సినిమా కిరణ్ కెరీర్‌ను మ లుపు తిప్పింది. ఈ సినిమా తర్వాత ఒకట్రెండు ఫ్లాప్ సినిమాలు చేసిన తాజాగా ‘చెన్నై లవ్‌స్టోరీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘బేబీ’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత దర్శకుడు సాయిరాజేష్ కథతో, రవి నం బూరి డైరెక్షన్‌లో వచ్చిన సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. మరి..ఈ సినిమా ఆడియన్స్‌ను మెప్పించిందా? అనేది రివ్యూలో చదివేద్దాం (Chennai Love Story Movie Review)
కథ
నివి (గౌరి ప్రియ), అజయ్ (త్రిగుణ్) ప్రేమికులు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ పెళ్లి ముహూర్తం సమయానికి నివికి అజయ్ బ్రేకప్ చెప్తాడు. దీంతో నివి డిప్రెషన్‌లోకి వెళ్లి, మద్యానికి బానిస అవుతుంది. నివిని ఈ బాధ నుంచి బయటపడేసేందుకు ఆమె ఫ్రెండ్స్ చెన్నై తీసుకెళ్తారు. కానీ నివిలో మార్పు లేదు. ఇదే సమయంలో నివి ఫ్రెండ్స్‌కు దగ్గరై, వీరి రూమ్‌లోకి వస్తాడు స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం). స్టీవెన్ ప్రవర్తన వ్యవహార శైలి మొదట్లో నివికి చిరాకు తెప్పించిన, మెల్లిగా స్టీవెన్ స్నేహానికి దగ్గర అవుతుంది నివి. కానీ మళ్లీ నివి జీవితంలో మరో విషాదం చోటుచేసుకుంటుంది? అది ఏమిటి? నివి–స్టీవెన్‌ల ప్రేమకథ ఏమైంది? దర్శకుడు కావాలనుకున్న స్టీవెన్ శంకర్ లక్ష్యం నెరవేరిందా? అన్నది
ఈ సినిమా మిగిలిన కథాంశం (Chennai Love Story story).
విశ్లేషణ
‘చెన్నైలవ్‌స్టోరీ’ సినిమాకు సాయిరాజేష్ కథ అందించాడు. సాయిరాజేష్ డైరెక్షన్‌లో వచ్చిన గత చిత్రాలు ‘కలర్‌ఫోటో, బేబీ’. ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ పాత్ర చాలా బలంగా ఉంటుంది. ప్రేమకథలు కూడా ప్రధానంగా హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సాగుతున్నా యనిపిస్తోంది. ‘చెన్నై లవ్‌స్టోరీ’ చిత్రంలోనూ ఇదే తీరు. హీరోయిన్ పాత్ర చుట్టూ బలమైన ఎమోషన్‌తో కూడిన సన్నివేశాలను రాసు కొచ్చారు సాయిరాజేష్. ఇంట్రవెల్‌లో ఆడియన్స్‌కు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ అంశం తర్వాత సెకం డాఫ్‌ను దర్శకుడు రవి నంబూరి, ఈ చిత్రం రచయిత సాయిరాజేష్‌లు ఎలా డీల్ చేశారు? అన్న ఆసక్తి అయితే కలుగుతుంది.
కానీ ఇక్కడ్నుంచే హీరో ఆత్మఘోష మొదలువుతుంది. లాజిక్ గురించి ఆలోచించకుండ ఉంటే…ఈ సినిమా ఆడియన్స్‌కు ఒకే అనిపించింది. లేదంటే కొంచెం కష్టమే. పైగా రామ్–తమన్నాల ‘ఎందుకంటే ప్రేమంట..’, ‘ఈగ’ సినిమాల్లోని సీక్వెన్స్‌లు గుర్తొస్తాయి. ఆత్మఘోష సీక్వెన్స్‌ను జస్టిఫై చేయడానికి ఫస్ట్‌హాఫ్‌లో దర్శ కుడు హోటల్‌లో ఓ సీన్ పెట్టాడు. ‘నమ్మితే నిజం..నమ్మకపోతే అబద్ధం’ అని. ఇక్కడ కూడా అంతే. .ప్రేక్ష కులు నమ్మితే నిజం…నమ్మకపోతే లాజిక్ లెస్. ఇక ప్రీ క్లైమాక్స్‌లో కుక్కుల నేపథ్యంతో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ ఫర్వాలేదనిపిస్తోంది. క్లైమాక్స్ ఎమోషనల్‌గానే అనిపించింది. ఈ సినిమా ఓవరలాల్‌గా అబౌవ్ యావరేజ్ అనిపిస్తుంది. లవ్‌స్టోరీ జానర్ సినిమాలు ఇష్టపడేవారికి నచ్చుతుంది. సెకండాఫ్‌ను డీల్ చేయ డంలో దర్శకుడు రవి తడబడ్డాడు. సాగదీత ధోరణి కనిపిస్తుంది. ఊహాత్మక సన్నివేశాలు మరో మైనస్.
నటీనటుల పెర్ఫార్మెన్స్
స్టీవెన్ శంకర్ పాత్రలో కిరణ్ అబ్బవరం యాక్టింగ్ ఉన్నంతగా ఉంది. ‘క’ వంటి యాక్షన్ సన్నివేశాల్లోనే కాక, మంచి ఎమోషనల్ డెప్త్ ఉన్న సన్నివేశాల్లోనూ యాక్టర్‌గా తన ప్రతిభ ప్రేక్షకులు మెచ్చుకోదగినదని ఈ సిని మాతో నిరూపించే ప్రయత్నం చేశాడు కిరణ్. ఇక ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌ను సైతం డామినేట్ చేసే పాత్రలో శ్రీ గౌరిప్రియ పెర్ఫార్మెన్స్ సూపర్భ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా భోవోద్వేగభరితమైన సన్నివేశాల్లో
గౌరి ప్రియ యాక్టింగ్ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. ఆమె పెర్ఫార్మెన్స్‌కు మంచి స్కోప్ ఇచ్చిన సినిమా ఇది. కీలకమైన అజయ్ పాత్రలో త్రిగుణ్ నటన బాగుంది. సిరి హనుమంతు, నవీన్, పూజ, కార్తీక్..వారి వారి పాత్రల మేరకు యాక్ట్ చేశారు. పి.వాసు, కరుణకుమార్ అతిథి పాత్రలు చేశారు. సాయిరాజేష్ కథను దర్శ కుడు రవినంబూరి బాగానే తీశాడు. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం మణిశర్మ సంగీతం. ఈ సినిమాకు స్క్రీన్‌పై కనిపించకుండ, వినిపించిన హీరో మణిశర్మనే. మ్యూజిక్, ఆర్‌ఆర్ చాలా బాగున్నాయి. తన సంగీతంతో ఈ సినిమాను నిలబెట్టారు మణిశర్మ. విశ్వాస్ డేనియల్ విజువల్స్ బాగునే ఉన్నాయి. దాదాపు 100 రోజులు ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. ఈ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
లవ్‌స్టోరీ సినిమాలు చూసేవారికి ఈ చెన్నైలవ్‌స్టోరీ సినిమా నచ్చొచ్చు. కానీ సెకండాఫ్‌లో వచ్చే లాజిక్‌ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తేనే ఈ సినిమా బాగుంటుంది.

unlocker.ai – The Ultimate AI Tool for Bypassing Restrictions and Unlocking Content Seamlessly!
The Ultimate AI Tools for Bypassing Restrictions and Unlocking Content Seamlessly!
it is a very good-net page
Finally found a platform that doesn’t lag during peak hours. The login process is smooth and the interface is very user friendly. Give hoki69login a try if you want a hassle free game.