‘జైలర్ 2’ బాలయ్య ప్లేస్ లో కోలీవుడ్ స్టార్..?

Kumar NA
1 Min Read

Web Stories

Jailer 2 update : సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో 2023లో సంచలనం సృష్టించిన ‘జైలర్’ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ సిద్ధమవుతోంది. ‘జైలర్ 2’ లో పార్ట్1 కి మించిన భారీ తారాగణంతో రాబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘జైలర్’ మొదటి భాగంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్ల క్యామియోలు అందరినీ ఆకట్టుకున్నాయి. సీక్వెల్‌లో వీరందరూ కొనసాగుతూనే, మరికొందరు అగ్ర హీరోలు తోడవుతున్నారు.

గతంలో ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ నటిస్తారని ప్రచారం జరిగినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఆ స్థానంలో విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ అంటే తనకు ఎంతో అభిమానమని, ఆయనతో పనిచేయడం వల్ల ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చని ఒక ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి ఈ విషయాన్ని స్వయంగా ధ్రువీకరించారు. గతంలో వీరిద్దరూ ‘పేట’ చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఒక పవర్‌ఫుల్ అతిధి పాత్రలో మెరవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కూడా ఇటీవల ఒక సందర్భంలో షారుఖ్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఇదే గనుక నిజమైతే ‘జైలర్ 2’ ఇండియన్ సినిమాలోనే అతిపెద్ద మల్టీస్టారర్ అవుతుందని చెప్పొచ్చు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అదిరిపోయే బాణీలతో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి కానుకగా జూన్ 12న విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తంగా ‘జైలర్ 2’ లో రజనీకాంత్‌తో పాటు ఇంతమంది స్టార్ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయం.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi