AlluArjun fans: ఇటీవలి కాలంలో ఫ్యాన్స్‌తో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు అల్లు అర్జున్. ఈ సమావేశాలకు తగ్గట్లు గానే ఆయన అభిమానులు సోషల్‌మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా అభిమానుల కోసం అల్లు అర్జున్ మరో ముందడుగు వేశాడు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFS) (ఏఏఎఫ్‌ఏ)ను ఏర్పాటు చేయడమే కాకుండ, ఈ అసోషియేషన్‌లోని సభ్యులకు యోగక్షేమాలపై అల్లు అర్జున్ దృష్టి సారించారు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోషియేషన్ (ఏఏఎఫ్‌ఏ) Allu Arjun Fans Association (AAFA)వార్షిక సదస్సు హైదరాబాద్‌లో జరిగింది. ఈ సదస్సుకు ఏడు రాష్ట్రాల నుంచి దాదాపు 1000మంది అభిమానులు పాల్గొన్నారు. ఈ అభిమానుల కోసం అల్లు అర్జున్ ఆరోగ్య బీమా చేయించారు. దాదాపు రూ.3 లక్షలు బీమా ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది.
ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు చర్చనీయాంశమైయ్యాయి. సోషల్‌మీడియాలో ట్రోలింగ్ చేస్తూ, సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని, సొంత ఎదుగుదలకు ఈ సమయాన్ని కేటాయించాలని అల్లు అర్జున్ తన అభిమానులకు హితబోధ చేశారు.
మరోవైపు అల్లు అర్జున్ రాజకీయరంగప్రవేశం ఉండబోతుందని ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో, అల్లు అర్జున్ ఇలాంటి వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం అనేది సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇంకోవైపు మెగాఫ్యామిలీకి సంబంధించి మెగా యూత్‌ఫోర్స్ కూడా యాక్టివ్ అవుతోంది. ఈ తరుణంలో భవిష్యత్‌లో ఏం జరుగబోతోందన్న ఆసక్తి సినిమా లవర్స్‌లో నెలకొంది.
ఇక సినిమాల విషయానికి వస్తే…ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ ‘రాకా’ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాదే పూర్తి చేసి, ఈ ఏడాది చివర్లో లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లోని ‘ఏఏ23’ సినిమాను స్టార్ట్ చేయాలని అల్లు అర్జున్ అనుకుంటున్నారు. అలాగే మలయాళ దర్శకుడు– నటుడు బాసిల్ జోసేఫ్ డైరెక్షన్‌లో చేయనున్న ఓ సిని మాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తారు.