Legendary singer Asha Bhosle has passed away: ప్రముఖ గాయని ఆశాభోంస్లే కన్నుమూశారు (Asha Bhosle Died). ఛాతీలో ఇన్ఫెక్షన్ సోకడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి, ఆమె తుదిశ్వాస విడిచారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుండగానే, ఆశాభోంస్లే ప్రపంచానికి దూరమైయ్యారు. ఇక 1933లో మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించారామె.
సంగీత ప్రపంచంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆశాభోంస్లే ప్రయాణం 1943లో వచ్చిన మరాఠి చిత్రం ‘మాఝా బళ్’తో ప్రారంభమైంది. 1950 సమయంలో ఆమె బాలీవుడ్‌లో కెరీర్‌ను స్టార్ట్ చేశారు. 1952లో రిలీజైన ‘సంగ్దిల్’ సినిమా ఆశాభోంస్లే గొంతను ప్రపంచానికి గట్టిగా వినిపించేలా చేసింది.

బాగా పాపులర్ అయ్యారు. హిందీ చిత్రాలు ‘పరిణీత, బూట్‌పాలీష్’ వంటి సినిమాల్లో ఆమె పాడిన పాటలు గాయనిగా ఆమెకు ఇంకా పేరు ప్రఖ్యాతు లను తెచ్చిపెట్టాయి. ‘ఆజా ఆజా, పియా తు అబ్‌తో ఆజా, యే మేరా దిల్’ వంటి ట్రెండ్ సెట్టింగ్ సాంగ్స్‌ను పాడారామె. రఫీతో కలిసి ఆమె పాడిన ఎన్నోపాటలు ఎవర్‌గ్రీన్‌సాంగ్స్‌గా ఇప్పటికి వినిపిస్తూనే ఉన్నాయి.
‘చురాలియా హై తుమ్నే జో దిల్ కో, దమ్ మారో దమ్, యే మేరా దిల్ యార్ కా దీవానా, హంగామా హో గయా, ఏక్ మైన్ ఓర్ ఏక్ తు…’ వంటి ఎన్నో సూపర్‌హిట్ పాటలు ఆమె గాత్రం నుంచి వచ్చాయి. తెలుగు లో కూడ ఆమె దాదాపు 80 పాటలు పాడారు. ‘వస్తాడు నా రాజు..’ వంటి ఎన్నో హిట్ సాంగ్స్ ఉన్నాయి. 2000 సంవత్సరంలో దాదా ఫాల్కే అవార్డు, 2008లో పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారామె. రెండు జాతీయ అవార్డులతో పాటుగా, ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సాధించారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖలు సోషల్‌మీడియా మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ, పోస్టులు చేస్తున్నారు.
Easy to log in to 2ez bet. A simple and fast log in is important to me. Give it a shot if you are looking for sports bets. 2ez bet log in.
M666game’s got some seriously awesome games! I spent hours here last night and didn’t even realize it. I’d definitely recommend it to anyone looking for a good time. m666game
Spotted wc99game and decided to jump in. It’s alright, you know? Got some games to kill time with. Nothing groundbreaking, but it’s decent enough for a quick session. Give it a go! wc99game