పెద్ది రిలీజ్‌…ప్లాన్‌ ఏ..ప్లాన్‌ బీ..!

Viswa
2 Min Read

Web Stories

Peddi Postponed: అనుకున్నట్లే జరిగింది. ‘పెద్ది’ సినిమా రిలీజ్‌ వాయిదా (Peddi Postponed) పడింది. ‘పెద్ది’ సినిమా రిలీజ్‌ (Peddi Movie Release) విషయంలో చరణ్‌ తన ఫ్యాన్స్‌కు మరోసారి సారీ చెప్పిన ట్లయింది. ‘పెద్ది’ సినిమాను ఏప్రిల్‌ 30 నుంచి జూన్‌కి వాయిదా వేశారు. టాకీ పార్టు పూర్తయిందని, ఓ సాంగ్‌ మాత్రమే బ్యాలెన్స్‌ ఉందని షూటింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చి, పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ను మరింత క్వాలిటీ చేయాలనే ఉద్దేశంతోనే, ‘పెద్ది’ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశామని ‘పెద్ది’ యూనిట్‌ పేర్కొంది.

జూన్‌లో ఏ రిలీజ్‌ డేట్‌ అని మాత్రం ఇంకా కర్ఫార్మ్‌ చేయలేదు. యశ్‌ టాక్సిక్‌ సినిమా జూన్‌ 4న రిలీజ్‌కు సిద్ధమైంది. ఒకవేళ ‘టాక్సిక్‌’ సినిమా రిలీజ్‌ ఏమైనా వాయిదా పడితే, ఈ తేదీకి ‘పెద్ది’ సినిమాను రిలీజ్‌ చేయాలన్నది పెద్ది ప్లాన్‌ ఏ. ఒకవేళ జూన్‌ 4న (Peddi Movie Release date) ‘టాక్సిక్‌’ సినిమా విడుదల అయితే, జూన్‌ 25న పెద్ది సినిమాను రిలీజ్‌ చేయానల్నది ‘పెద్ది’ టీమ్‌ ప్లాన్‌ బి. ప్లాన్‌ ఏ వర్కౌట్‌ అయితే ఫర్వాలేదు. కానీ ప్లాన్‌ బి అంటేనే ప్రాబ్లమ్‌.

ఎందుకంటే…మే 1న అఖిల్‌ ‘లెనిన్‌’ సినిమా రిలీజ్‌ కావాల్సింది. ఏప్రిల్‌ 30న ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేయగానే, ‘లెనిన్‌’ టీమ్‌ తమ రిలీజ్‌ డేట్‌ను జూన్‌ 26కి మార్చుకుంది. ఇప్పుడు మరోసారి ‘పెద్ది’ కోసం లెనిన్‌ కాంప్రమైజ్‌ అవుతాడా? అన్నది చూడాలి.

ఇక రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్పోర్ట్స్‌ విలేజ్‌ యాక్షన్‌ సినిమా ‘పెద్ది’. ఇందులో రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది. జాన్వీకపూర్‌ హీరోయిన్‌. జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్వేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తు న్నారు. ఏఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీమూవీమేకర్స్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు ఈ ‘పెద్ది’ సినిమాను నిర్మిస్తున్నారు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi