మెక్సికో వేదికపై వారణాసి ఎక్స్‌క్లూజివ్‌ కంటెంట్‌

Viswa
2 Min Read

Web Stories

Varanasi exclusive Content: మహేశ్‌బాబు హీరోగా ‘వారణాసి’ సినిమాను  (Varanasi Movie)అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు రాజమౌళి. తన దర్శకత్వంలోని గత చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ వచ్చింది. దీంతో రాజమౌళి (Varanasi Director SSRajamouli) అంతర్జాతీయ స్థాయిలో పాపులర్‌ అయ్యారు. ఈ పాపులర్‌ ఇమేజ్‌ని ‘వారణాసి’ సినిమాతో మరింత పెంచుకోవాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ మీడియా మీడియా ప్రతి నిధులతో  ‘వారణాసి’ సినిమా ప్రమోషన్స్‌ చేయించారు రాజమౌళి. ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ వేదికపై ‘వారణాసి’ సినిమా ప్రస్తావనకు రానుంది.

ఏప్రిల్‌ 24 నుంచి ఏప్రిల్‌ 26 వరకు మెక్సికో వేదికగా ‘కామిన్‌కాన్‌ ఎక్స్‌పీరియన్స్‌’ (Comic con experience event Varanasi Content) ప్రోగ్రామ్‌లో భాగంగా, ‘వారణాసి’ సినిమా కంటెంట్‌ను ప్రదర్శించ నుంది యూనిట్‌. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎస్‌ఎస్‌ కార్తీకేయ ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ‘వారణాసి’ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజిక్‌ కంటెంట్, బిహైండ్‌ సీన్స్, మేకింగ్‌ విజువల్స్‌ను ప్రదర్శించనున్నారట.

ప్రస్తుతం ‘వారణాసి’ సినిమా చిత్రీకరణ అంటార్కిటికాలో జరుగుతోంది. దీంతో మెక్సికోలోని ఈవెంట్‌కు రాజమౌళి హాజరుకాకపోవచ్చని తెలిసింది. అయితే ఆయన్నుంచి ఓ వీడియో సందేశం రానుందని తెలిసి ంది. ఇక అంటార్కిటికా లోకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న తొలి ఇండియన్‌ సినిమా ‘వారణాసి’యే కావడం విశేషం. అలాగే తొలి సినిమా కూడా ‘వారణాసి’యే.

మహేశ్‌బాబు హీరోగా, ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్‌సుకుమారన్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఎస్‌ఎస్‌ కార్తీకేయ, కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ‘వారణాసి’ సినిమా థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

 

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi