గోపీచంద్‌ కొత్త సినిమా టైటిల్‌ సింగ

Viswa
1 Min Read

Web Stories

T Gopichand Singa Movie: గోపీచంద్‌  (Hero T Gopichand ) హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘సింగ’ (Singa Movie) అనే టైటిల్‌ ఖరారైంది. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ వి. వెంకట్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, 70ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశిదేవి రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూన్‌ 12న గోపీచంద్‌ బర్త్‌ డే సందర్భంగా ‘సింగ’ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. మలయాళ నటి అనార్కలి నజర్‌ ఈ ‘సింగ’ సినిమాతో టాలీవుడ్‌కు వస్తున్నారు.

రివెంజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్‌ కెరీర్‌లోని ఈ 34వ సినిమా విడుదల ఈ ఏడాదే ఉండొచ్చు. మరోవైపు గోపీచంద్‌ హీరోగా సంకల్ప్‌ రెడ్డి డైరెక్షన్‌లో రూపొందుతున్న హిస్టారికల్‌ యాక్షన్‌ డ్రామా ‘భరతవర్ష’ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi