Oh Sukumari teaser: తిరువీర్ (Thiruveer), ఐశ్వర్యారాజేష్ (Aishwarya Rajesh) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న విలేజ్ రొమాంటిక్ ఫీల్‌గుడ్ మూవీ ‘ఓ..సుకుమారి’ (Oh Sukumari Teaser). భరత్ దర్శన్ దర్శ కత్వంలో మహేశ్వరరెడ్డి మూలి నిర్మించిన ఈ సినిమా త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
అప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్న ఒక కుర్రాడు ఓ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ అమ్మాయికి ఓ ప్రాబ్లమ్ ఉంటుంది. అది ఏంటంటే..ఆ అమ్మాయిని మట్టుకుంటే షాక్ కొడుతుంది. ఈ విషయాన్ని అమ్మాయి తరఫు వాళ్లు దాచి, పెళ్లి చేస్తారు. మరి..ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఫన్‌తో పాటుగా, కామెడీ ఎలిమెంట్స్ కూడా, ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది.
మురళీధర్ గౌడ్, విష్ణు ఓయ్, ఝాన్సీ, ఆనందకోటజయరామ్, ఆమని ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత, తెలుగులో నేను సైన్ చేసిన తొలి సినిమా ఇదేనని ఐశ్వర్యారాజేష్ చెప్పారు. హీరోయిన్‌ను ముట్టుకుంటే షాక్ కొడుతుందనే కాన్సెప్ట్ ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో రాలేదనే తాను అనుకుంటు న్నానని, కథ నచ్చి ఈ సినిమా ఒకే చేశానని ఆమె తెలిపారు. ఇక ఫ్యామిలీ, పిల్లలు కలిసి చూసి ఎంజాయ్ చేసేలా, వారు ఎక్కువకాలం గుర్తుంచుకునేలా, ‘ఓ..సుకుమారి’ సినిమా ఉంటుందని హీరో తిరువీర్ చె ప్పారు.