jojo movie title announcement poster: కృష్ణ కమల్, మాహి శ్రీ, ఫణీంద్ర దేవరపల్లి, ప్రభావతి, మహబూబ్ బాషా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘జో జో’ (jo jo movie). రా అండ్ రస్టిక్ రొమాంటిక్ కామెడీ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు ‘మయసభ’ ఫేమ్ కిరణ్ జయ్‌కుమార్ దర్శకత్వం వహిస్తుండటంతో పాటుగా, కథ–కథనం–మాటలు సమకూ ర్చుతున్నారు. ప్రముఖ దర్శకుడు దేవకట్టా సమర్పణలో విజయ్ కృష్ణ లింగమనేని ఈ సినిమాను నిర్మిస్తు న్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టైటిల్ పోస్టర్‌పై ‘హెచ్చరిక: మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి!’ అని ఉంది.
మకుటం సినిమా రివ్యూ…తండ్రిపై కొడుకుకి అంత కోపం ఎందుకు?

విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా రివ్యూ….కోపం -ద్వేషం అలసిపోయినప్పుడు….!
కరువు పరిస్థితులతో ఉన్న గ్రామీణ నేపథ్యం, ఊహించని విధంగా వజ్రం కోసం జరిగే అన్వేషణ, అదృష్టం కోసం కలలు కనే పాత్రలు.. ఆ కలలను సాకారం చేసుకునే క్రమంలో ఎదురయ్యే సమస్యలతో ‘జో జో’ ఓ డిఫరెంట్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోంది. రా అండ్ రస్టిక్ ఫీల్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతోంది. సతీష్ దేవట్టే తంజోర్, పూడూరు శరత్ బాబు, మకరంద్ దేశ్‌పాండే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మహేశ్‌శంకర్ సంగీతం అందిస్తున్నారు. ‘మయసభ’ తర్వాత దేవకటా, కిరణ్ విజయ్‌కుమార్ కాంబినేషన్‌తో రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.