హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టే సీన్‌ ఉందా?

Viswa
1 Min Read

Web Stories

Suriya Scene Movie Title Teaser: ‘కరుప్పు (తెలుగులో ‘వీరభద్రుడు’)’, ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ వంటి విజయాల తర్వాత సూర్య హీరోగా నటించి, రాబోతున్న సినిమా ‘సీన్‌’ (Scene Movie). మలయాళంలో ‘ఆవేశం’ సినిమాతో హిట్‌ కొట్టిన, జీతూ మాధవన్‌ ఈ సీన్‌ సినిమాకు దర్శకుడు. ఈ సీన్‌ సినిమా దీపావళి సందర్భంగా నవంబరు 6న (Suriya Scene Movie Release date) థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. లేటెస్ట్‌గా ఈ సీన్‌ సినిమా తెలుగు టీజర్‌ రిలీజైంది. ఇందులో ఓ సైకో పోలీస్‌ ఆఫీసర్‌ ప్రేమ్‌రాజ్‌ పాత్రలో సూర్య నటించారు.

‘ప్రేమ్‌రాజ్‌ సార్‌ కనిపిస్తే..ఖైదీలందరూ అదొ టైప్‌లో బిహేవ్‌ చేస్తారు..సార్‌’, ‘ప్రేమ్‌రాజ్‌ సార్‌ వసు ్తన్నారు…’, ‘నేనే…ఈ ఫేస్‌ బాగా చూడు….’, ‘నీకు నేను నిన్ను అరెస్ట్‌ చేసిన ఓ పోలీస్‌నే కావొచ్చు… కానీ నాకు నేను జైల్లో వేసిన 900మంది క్రిమినల్స్‌లో నువ్వొక చిల్లరగాడివి….’ అన్న సంభాషణలు సూర్య ‘సీన్‌’ సినిమా తెలుగు టైటిల్‌ టీజర్‌లో ఉన్నాయి. ఈ సినిమాను సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇక ఈ సీన్‌ మూవీలో నజ్రియా నసీమ్, నస్లేన్, ఆనంద్‌రాజ్, లాల్, రాజ్‌ ప్రియన్‌…ఇతర ప్రధాన పాత్రల్లో (Scene movie cast and crew) నటిస్తు న్నారు. సుషిన్‌ శ్యామ్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మరి..‘కరుప్పు (తెలుగులో ‘వీరభద్రుడు’)’, ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ సినిమాల తర్వాత ‘సీన్‌’తో కూడా హిట్‌ కొట్టి, సూర్య హ్యాట్రిక్‌ కొడతారా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

ఈ సంగతి ఇలా ఉంచితే..ఈ దీపావళి పండక్కి….సూర్య ‘సీన్‌’తో పాటుగా, నయనతార ‘మహాదేవి’, రణ్‌బీర్‌కపూర్‌ ‘రామాయణ’ సినిమాలు కూడా రిలీజ్‌ అవుతున్న సంగతి తెలిసిందే.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu