అదనంగా 50 కోట్లు బడ్జెట్‌…డిసెంబరులో వేట్టువం

Viswa
1 Min Read
Vettuvam Movie Poster

Web Stories

Vettuvam Movie Release: ‘కబాలి’, ‘కాలా’ సినిమాలు తీసిన దర్శకుడు పా.రంజిత్‌ (Vettuvam Movie Director Pa. Ranjith) తెరకెక్కించిన తాజా సినిమా ‘వేట్టువం’ (Vettuvam Movie). ఆర్య, శోభితా« దూళిపాళ్ళ, వీఆర్‌ దినేష్, గురుసోమసుందరం (Vettuvam Movie cast and crew) ఈ సినిమాలోని లీడ్‌ రోల్స్‌లో నటించారు. పా. రంజిత్, సాయి దేవానంద్, సాయి వెంకటేశ్వరన్‌ కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా ‘వేట్టువం’ సినిమా నుంచి ‘వేట్టువం’వరల్డ్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. రానా వాయిస్‌ ఓవర్‌తో ‘వేట్టువం’ వరల్డ్‌ స్టోరీ (World Of Vettuvam)  కథనం వినిపి స్తోంది. పలు జాతుల్లోనూ, పలు తెగల్లోనూ అధికారం ఎవరికి ఉండాలి? అని నిరూపించుకోవడానికి జరిగే పోరాటాన్నే ‘వేట్టువం’ సినిమా కథనం అని మేకర్స్‌ చెబుతున్నారు. ఇంకా ఈ వేట్టువం కథనం మూడు కాలమానాల్లో జరుగుతుందని, ఇదొక సైన్స్‌ ఫిక్షన్‌ కథ అని చిత్రంయూనిట్‌ తెలిసింది. అలాగే అడిమురై, మల్లకుంభ వంటి పురాతన యుద్ధ కళలను నేర్చుకుని, ఈ చిత్రంలోని నటీనటులు యాక్ట్‌ చేశారని యూనిట్‌ తెలిపింది.

ఆ రోజు ఆకాశంలో ఒక తార

అయితే ఈ సినిమాను తొలుత రూ. 25 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించాలని స్టార్ట్‌ చేశారు. ఆ తర్వాత ఈ సినిమా బడ్జెట్‌ మరో యాభైకోట్ల రూపాయలకు పెరిగింది. ఈ విషయాన్ని ఈ చిత్రం హీరో ఆర్యనే చెప్పారు. ఇలా అనుకున్న బడ్జెట్‌ కన్నా, ‘వేట్టువం’ సినిమా ఖర్చు రెండితలు పెరిగింది. మరి..వసూళ్ల పరంగా ‘వేట్టువం’ సినిమా ఎంత మేరకు కలెక్ట్‌ చేస్తుందనేది చూడాలి. ఈ ‘వేట్టువం’ సినిమా డిసెం బరులో రిలీజ్‌ కానుంది. విడుదల తేదీపై మేకర్స్‌ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu