HATAH Movie Teaser: దీపావళి సీజన్‌ను క్యాష్ చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయినట్లు ఉన్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaraam). ఈ యువ నటుడు, దర్శక–నిర్మాత ప్రతి దీపావళికి తనదోక సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. 2025 దీపావళికి హీరోగా ‘క’ సినిమాతో హిట్ కొట్టాడు కిరణ్ అబ్బవరం. ఆ మరుసటి సంవత్సరం దీపావళికి‘కె ర్యాంప్’తో మరో సక్సెస్‌ను అందుకున్నాడు కిరణ్. ఇప్పుడు తాను నిర్మాతగా ఈ దీపావళికి ‘హతః’ అనే సినిమాతో రాబోతున్నాడు. చూస్తుంటే…ప్రతి సంక్రాంతికి అనిల్‌రావిపూడి సినిమా రిలీజ్ అవుతున్నట్లుగా, ప్రతి దీపావళికి తన సినిమాను నిర్మాతగానో, హీరోగానే రిలీజ్ చేయాలని కిరణ్ అబ్బవరం ఫిక్స్ అయి నట్లుగా తెలుస్తోంది.
రెహమాన్, ఖుష్లూ, తనూజ పుట్టుస్వామి లీడ్ రోల్స్‌లో నటించిన ‘హతః’ సినిమాకు అనుష్ గోరక్ (HATAH Movie Director Anush Gorak ) దర్శకత్వం వహిచంగా, శివశంకర నాయుడుతో కలిసి కిరణ్ అబ్బవరం ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసి, సినిమాను నవంబరు 6న (HATAH Movie Release date)రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి..2024, 2025 దీపావళి పండగల్లాగే, 2026లోనూ కిరణ్ అబ్బవరం సక్సెస్ సాధిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
మరోవైపు ఈ నవంబరు 6న సూర్య ‘సీన్’, నయనతార ‘మహాకాళి’, రణ్‌బీర్‌కపూర్ ‘రామాయణ’ సినిమాలు రిలీజ్‌కు షెడ్యూల్ అయిన విషయం తెలిసింది. ఈ భారీ సినిమాల మధ్య కిరణ్ అబ్బవరం హతః సినిమా ఏ మేరకు బాక్సాఫీస్ వద్ద రాణిస్తుందో చూడాలి.
ఇక కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ‘రియాలిటీ’ అనే సినిమా చేస్తున్నాడు. కిరణ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరులో క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన అందాల్సి ఉంది.