విదేశాల్లో చదువుకోసం గ్యాంబ్లింగ్‌

Viswa
1 Min Read

Web Stories

POCKET ROCKKETS Movie: కొత్త ట్యాలెంట్‌తో సరికొత్త కథలను ఎంచుకుంటూ ట్రెండీ సినిమాలను తీస్తూ నిర్మాతగా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తున్నారు నిహారిక కొణిదెల (Niharika Konidela). ఇప్పటికే ఈ యువ నిర్మాత నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సాధించగా, సంగీత్‌శోభన్‌ ‘రాకాసి’ సినిమా ఫర్వాలేద నిపించింది. తాజాగా నిహారిక కొణిదెల ‘పాకెట్‌ రాకెట్స్‌’ అనే సినిమాను నిర్మించారు.

కమిటీ కుర్రోళ్ళు సినిమాలో నటించిన త్రినాథ్‌ వర్మ ఒక హరోగా, కొత్త అబ్బాయి నిర్మల్‌ మరో హీరోగా ఈ సినిమాలో నటించారు. సమంత నిర్మించిన ‘శుభం’ సినిమాలో నటించిన శ్రీయా కొంతం హీరోయిన్‌గా చేశారు. రుద్ర అత్రి దర్శకత్వంలో పద్మజ కొణిదెల, రాహుల్‌ రాఘవేంద్ర, రాహుల్‌ నిమ్మకూరి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 11న (POCKET ROCKKETS Movie release date) థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు మేకర్స్‌.

Pocket Rockket movie Teaser launched Event

విదేశాల్లో చదువుకోవాలనుకునే ఓ కుర్రాడు గ్యాబ్లింగ్‌లోకి దిగి డబ్బులు సంపాదించి, ఆ డబ్బుతో విదేశాల్లో చదువుకోవాలనుకుంటాడు. ఇందుకు ఈ అబ్బాయి క్లాస్‌మేట్‌ సాయం చేస్తుంది. డబ్బులిచ్చి శ్రీలంకకు పంపిస్తుంది. అలా శ్రీలంకకు వెళ్లిన ఇద్దరు బస్తీ కుర్రాళ్లు గ్యాంబ్లింగ్‌ మాయలో ఎలా చిక్కుకున్నారు? అన్నదే ‘పాకెట్‌ రాకెట్స్‌’ సినిమా ప్రధాన కథాంశంగా తెలుస్తోంది. జేడీ చక్రవర్తి, శ్రీనివాస్‌ అవసరాల, శ్రీనివాస్‌ వడ్లమాని, కిరిటీ దామరాజు ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఆల్రెడీ సినిమా షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. ఒకవేళ ఈ సినిమా కూడ విజయం సాధిస్తితే… నిర్మాతగా నిహారిక కొణిదెల హాట్రిక్‌ హిట్‌ను నమోదుచేసినట్లే అవుతుంది.మరి..ఇదే జరుగు తుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah