ఈ సారి లవ్‌ కాదు..వార్‌!

Viswa
1 Min Read

Web Stories

King100 tabu Glimpse: నాగార్జున (Hero Nagarjuna), టబు…తొలిసారిగా 1995లో వచ్చిన ‘సిసింద్రీ’ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌ ‘ఆటాడుకుందాం రా..’లో కలిసి డ్యాన్స్‌ చేశారు. అప్పట్లో ఈ పాటకు బాగా హిటై్టంది. దీంతో ఆ తర్వాత 1996లో వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’, 1998లో వచ్చిన ‘ఆవిడ మా ఆవిడే’ సినిమాల్లో నాగార్జున–టబులు కలిసి హీరో హీరో యిన్లుగా నటించారు. ఆ తర్వాత ఈ స్టార్‌ యాక్టర్స్‌ మళ్లీ కలిసే నటించే అవకాశం కుదర్లేదు.

ఎట్టకేలకు 28 సంవత్సరాల తర్వాత నాగార్జున హీరోగా నటిస్తున్న వందో సినిమా ‘కింగ్‌ 100’ (king 100) లో మహంతి ఝాన్సీరాణి పాత్రలో టబు (Heroine tabu) నటిస్తున్నారు. బుధవారం ఆమె బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘కింగ్‌ 100’ సినిమా నుంచి ఓ స్పెషల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. లక్‌ అంటే ఏమాత్రం నమ్మ కంలేని, కేవలం హార్డ్‌ వర్క్‌ను మాత్రమే నమ్మే మహంతి ఝాన్సీ రాణి పాత్రలో టబు యాక్ట్‌ చేస్తున్నారు. ఆమె ఓ రాజకీయ నాయకురాలు పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో ఆమె పాత్రలో నెగటివ్‌ షేడ్స్‌ ఉండబోతున్నా యని స్పష్టం అవుతోంది. సో..నాగార్జున, టబుల మధ్య ఈ సారి లవ్‌ కాదు..వార్‌ ఉండబోతున్నట్లు స్పష్టం అవుతోంది.

విదేశాల్లో చదువుకోసం గ్యాంబ్లింగ్‌

తమిళ దర్శకుడు రా. కార్తీక్‌ దర్శకత్వంలో నాగార్జున నటిస్తూ, నిర్మిస్తున్న ఈ ‘కింగ్‌ 100’ సినిమా క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరు 24న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రంలో ఐశ్వర్యారాజేష్‌ హీరోయిన్‌గా, నాగార్జున కుమార్తెగా సుష్మితాభట్, విలన్‌గా తమిళ యువ నటుడు అశోక్‌ సెల్వన్‌ నటిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రంలో పాలిటిక్స్‌తో పాటుగా, తండ్రీకూతుళ్ల ఎమోషన్‌ కూడా స్ట్రాంగ్‌ ఉండబోతుందని తెలిసింది.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah