టాలీవుడ్‌కు బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షీ సిన్హా

Sonakshi Sinha: సుధీర్‌బాబు జటాధర సినిమాతో బాలీవుడ్‌ బిగ్‌ హీరోయిన్‌ సోనాక్షీ సిన్హా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు.

Viswa
1 Min Read
Sonakshi Sinha

Web Stories

బాలీవుడ్‌లోని వన్నాఫ్‌ ది టాప్‌ హీరోయిన్స్‌లో ఒకరైన సోనాక్షీ సిన్హా (Sonakshi Sinha) తెలుగు చలన చిత్ర పరి శ్రమకు వస్తున్నారు. సుధీర్‌బాబు హీరోగా చేస్తున్న సూపర్‌నేచురల్‌ థ్రిల్లర్‌ మూవీ ‘జటాధర’ (Jatadhara) లో సోనాక్షీ సిన్హా హీరోయిన్‌గా నటించనున్నారు. ఉమెన్స్‌ డే సందర్భంగా ఈ విషయాన్ని మార్చి 8న అధికారికంగా ప్రకటించారు. ఈనెల10న ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు సోనాక్షీ సిన్హా, ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. కాగా ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ రాజస్తాన్‌లోని మౌంట్‌ అటు ఫారెస్ట్‌ లొకేషన్స్‌కు వెళ్ల నుంది. అక్కడి మౌకా స్టూడి యోస్‌లో ‘జటాధర’ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. వెంకట్‌ కళ్యాణ్‌ డైరెక్షన్‌లో, జీ స్టూడి యోస్‌ ఉమేష్‌ కేఆర్‌ బన్సాల్, ప్రేరణా అరోరా, అరుణ అగర్వాల్, శివిన్‌ నారంగ్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

పద్మనాభస్వామి ఆలయం చుట్టూ..నిధి అన్వేషణ

‘జటాధర’ సినిమా అనంతపద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. చరిత్ర, పురా ణాలు, విజ్ఞాన శాస్త్రం, నిధి అన్వేషణ, దైవిక శక్తి, రహస్యాలు…వంటి అంశాలను మిళితం చేసి, ‘జటాధర’ సినిమాను తీస్తున్నారు. ఈ సినిమా కోసం సుధీర్‌బాబు ప్రత్యేకంగా మేకోవర్‌ అవుతున్నారు. కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు.

షూటింగ్‌ ఆలస్యం!

ఈ జటాధర సినిమాను ప్రకటించినప్పుడే, ఈ 2024 శివరాత్రికి సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. కానీ విచిత్రంగా 2024 శివరాత్రికి ఈ సినిమా షూటింగ్‌యే ప్రారంభం కాలేదు. కానీ ఇప్పట్నుంచి వీలైనంత తొందరగా చిత్రీకరించి, ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది. తెలుగు, హిందీ భాషలతో పాటుగా, కన్నడం, మలయాళం, తమిళం భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నారట మేకర్స్‌.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi