మోహన్‌లాల్ (MohanLal) ‘లూసీఫర్’ మూవీ 2019లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీలో స్టీఫెన్ గట్టుపల్లి, అబ్రహాం ఖురేషీ పాత్రల్లో మోహన్‌లాల్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీకి దర్శకుడు. ఐదేళ్ల తర్వాత ‘లూసీఫర్ సీక్వెల్ ఎల్2: ఎంపురాన్’గా రాబోతోంది. మార్చి 27న ఈ మూవీ (Mohanlal L2 Empuran Release) థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడం భాషల్లో ‘లూసీఫర్’లోని రెండో భాగం ‘లూసీఫర్: ఎల్2: ఎంపురాన్’ ( L2 Empuran Release) మూవీ రాబోతుంది. ఆంటోనీ పెరంబవూర్, గోకులం గోపాలన్‌లు ఈ మూవీని నిర్మించారు. లేటెస్ట్‌గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
‘లూసీఫర్’ సినిమాను మూడు భాగాలుగా…అంటే ఓ ట్రయాలజీగా ప్లాన్ చేశారు. తొలిభాగం 2019లో లూసీఫర్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చింది.ఆ తర్వాత 2022లో ‘లూసీఫర్ 2’ సినిమా కథను, పృథ్వీరాజ్‌సుకుమారన్..మోహన్‌లాల్‌కు వినిపించారు. అలా 2022 చివర్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. రెండోభాగం ఎల్2 (లూసీఫర్ 2): ఎంపురాన్’గా ఈ నెల 27న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. మూడో భాగం మరోనాలుగైదు ఏళ్ల తర్వాత థియేటర్స్‌లోకి రానుంది. ‘లూసీ ఫర్ 2’ సినిమా నిర్మాణాన్ని తొలుత లైకా ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసింది. ఫైనల్‌గా ఆంటోనీ పెరంబవూర్, గోకు లం గోపాలన్‌లు ‘లూసీఫర్’ సిని మాను రిలీజ్ చేస్తున్నారు.
రీసెంట్ టైమ్స్‌లో వచ్చిన మలయాళ చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలవడం, ‘లూసీఫర్’ మూవీ విజయంఊ సాధించడం వంటి అంశాలు ‘లూసీఫర్ 2’పై అంచనాలను పెంచేస్తున్నాయి.