please subscribe to Tollywoodhub YouTube channel

అఖిల్‌ సినిమాలో నాగార్జున?

Viswa
Nagarjuna in Akhil Lenin Movie movie News

Web Stories

రీసెంట్‌ టైమ్స్‌లో హీరోగా కన్నా, గెస్ట్‌ రోల్స్‌ చేసేందుకే నాగార్జున ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లుగా ఉన్నాడు. రణ్‌బీరకపూర్‌ ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేసిన తర్వాత, ధనుష్‌ ‘కుబేర’ సినిమాలో, రజనీకాంత్‌ ‘కూలీ’ సినిమాలో నాగార్జున లీడ్‌ రోల్స్‌ చేశారు. ఇప్పుడు మరోసారి మరో కీలక పాత్రల్లో నటించేందుకు నాగార్జున రెడీ అవుతున్నాడు (Akkineni Nagarjuna in AkhilLenin)

‘ఏజెంట్‌’ మూవీ తర్వాత అఖిల్‌ (Akhil Movie)  ‘లెనిన్‌’ (Lenin) మూవీ చేస్తున్నాడు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్‌ మురళీ కిషోర్‌ అబ్బూరి ఈ సినిమాకు దర్శకుడు. 30 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రం నిర్మాతలు నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నవంబరులో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. రీసెంట్‌గా అఖిల్‌ పెళ్లి జరిగింది. కాబట్టి…షూటింగ్‌ అనుకున్న ప్రకారం కన్నా..కాస్త ఆలస్యంగానే మొదలు కావొచ్చు. ఇదే జరి గితే…‘లెనిన్‌’ సినిమా (Lenin Movie Release) ఈ ఏడాది రిలీజ్‌ కాదు.

ఇక లెనిన్‌ సినిమా టీజర్‌ ఇటీవల విడుదలైంది. రాయలసీమ నేపథ్యంతో సాగే ఈ సినిమాలో చాన్నాళ్ళ క్రితం మా నాయన ఓ మాట చెప్పిండు….అన్న డైలాగ్‌ ఉంది. అంటే కథ ప్రకారం ఈ సినిమాలో అఖిల్‌ పాత్రకు ఉండే ఫాదర్‌ రోల్‌ చాలా పవర్‌ఫుల్‌ అనుకోవచ్చు. ఈ పవర్‌ఫుల్‌ ఫాదర్‌ పాత్రలోనే నాగార్జున నటించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ‘మనం’ సినిమాలో నాగార్జున, నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య కలిసి యాక్ట్‌ చేశారు. ఇప్పుడు తన చిన్న కొడుకు అఖిల్‌ ‘లెనిన్‌’ సినిమాలో నాగార్జున భాగ మయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజ జీవితంలో తండ్రీకొడుకులైన నాగార్జున, అఖిల్‌లు…‘లెనిన్‌’ సినిమాలోనూ తండ్రీకొడుకులగానే నటిస్తే అక్కినేని ఫ్యాన్స్‌కు పండగే. మరి..ప్రచారంలో ఉన్నట్లుగా.. ‘లెనిన్‌’ సినిమాలో నాగార్జున భాగం అవుతారా? చూద్దాం.

ప్రజెంట్‌ ధనుష్‌తో కలిసి నాగార్జున నటించిన ‘కుబేర’ సినిమా జూన్‌ 20న విడుదల కానుంది. అలాగే రజనీకాంత్‌ ‘కూలీ’ సినిమాలో నాగార్జున విలన్‌ రోల్‌ చేశాడు. ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్‌ అవుతుంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi