please subscribe to Tollywoodhub YouTube channel

పెద్ది భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌…థియేటర్స్‌లో ఫ్యాన్స్‌కి మాస్‌ పూనకాలే..!

Viswa
Ramcharan Peddi Cinema Shoot update

Web Stories

రామ్‌ చరణ్‌ (Ramcharan Peddi) లేటెస్ట్‌ మూవీ ‘పెద్ది (Peddi Update)’. ఈ మల్టీస్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా చిత్రానికి ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సాన దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. రామ్‌చరణ్, ఈ చిత్రం హీరోయిన్‌ జాన్వీకపూర్‌ (JanhviKapoor) పాల్గొనగా, కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అలాగే ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ తీస్తున్నారు మేకర్స్‌. ‘పెద్ది’ సినిమా కోసం అవినాష్‌ కొల్ల రెడీ చేసిన ఓ భారీ సెట్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. నవనీత్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేసిన ఈ సూపర్భ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ (Peddi cinema Action Sequemce)ను తీస్తున్నారు మేకర్స్‌.

‘పెద్ది’ (PeddiFirstshot)సినిమా ఫస్ట్‌షాట్‌లో రామ్‌చరణ్‌ కొట్టిన సిక్సర్‌ను డిజైన్‌ చేసినది ఈ నవనీత్‌ మాస్టర్‌యే. ఈ సినిమా లాంగ్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ మరో వారంలో రోజుల పాటు జరుగుతుంది. ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీ కరణ ఓ కీలక దశకు చేరుకున్నట్లవుతుంది.గతంలో ‘పెద్ది’ (Peddi Cinema)సినిమా చిత్రీకరణ ముప్ఫై శాతం పూర్తయినట్లు గా రామ్‌చరణ్‌ పేర్కొన్నారు. ఈ షెడ్యూల్‌ చిత్రీకరణతో పెద్ది మూవీ షూటింగ్‌ ఆల్మోస్ట్‌ యాభై శాతానికి చేరుకున్నట్లవుతుంది. ఈ నెక్ట్స్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ నార్త్‌ ఇండియాలో ఉండొచ్చు.

ఈ ‘పెద్ది’ (Peddi Movie) సినిమాలో జగపతిబాబు, శివరాజ్‌కుమార్‌ కుమార్, దివ్వేందులు ఇతర కీలక పాత్రల్లో నటి స్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకు సంగీత దర్శ కుడు. రామ్‌చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న ‘పెద్ది’ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. మార్చి చివరివారంలోనే రామ్‌చరణ్‌ కెరీర్‌లోని వన్నాఫ్‌ ది బెస్ట్‌ హిట్‌ మూవీ ‘రంగస్థలం,’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలు విడుదలైయ్యాయి. మరి..ఈ హిట్‌ సెంటిమెంట్‌ ఏమైనా పెద్ది సినిమాకు కలిసి వస్తుందెమో చూడాలి. ఇంకా కథ రిత్యా ఈ సినిమాలో క్రికెట్, కబడ్డీ, ఖోఖో వంటి స్పోర్ట్స్‌ ప్రస్తావన ఉంది. మేజర్‌గా ఈ సినిమా క్రికెట్, కబడ్డీ నేపథ్యంతో సాగుతుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత సుకుమార్‌తో సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్తారు రామ్‌చరణ్‌. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్‌తో రామ్‌చరణ్‌ ఓ సినిమా చేస్తారు. ఈ సినిమాకు పవన్‌కల్యాణ్‌ ఓ నిర్మాత. ఇంకా…సందీప్‌రెడ్డి వంగా, ప్రశాంత్‌నీల్, ‘కిల్‌’ ఫేమ్‌ నీల్‌ నగేష్‌ దర్శకులతోనూ రామ్‌చరణ్‌ సినిమా చేసే చాన్సెస్‌ ఉన్నాయనే టాక్‌ వినిపిస్తోంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi