Gummadi Narsaiah Biopic: ప్రఖ్యాత రాజకీయ నాయకుడు గుమ్మడి నర్సయ్య (Gummadi Narsaiah Biopic) జీవిత చరిత్ర వెండితెరపైకి రానుంది. పేద ప్రజల గురించి ఆలోచించే, వ్యక్తిగా గుమ్మడి నర్సయ్యకు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ఉంది. గుమ్మడి నర్సయ్య బయోపిక్‌కు పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తుండగా, ఎన్.సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ఎన్. సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. వెండితెరపై గుమ్మడి నర్సయ్యగా ప్రముఖ కన్నడ నటుడు, తెలుగు ప్రజలకు సుపరిచితులైన శివరాజ్ కుమార్ (SivaRajKumar) నటించనున్నారు. తాజాగా ఈ బయోపిక్ ఫస్ట్‌లుక్ పోస్టర్ (Gummadi Narsaiah Biopic Motion Poster), మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఇక ఈ మోషన్ పోస్టర్‌లో ఎమ్మేల్యేలు అంతా కూడా కారులో వస్తుంటే, గుమ్మడి నర్సయ్య మాత్రం సైకిల్‌లో రావడం, మ్యూజిక్, ఆర్‌ఆర్, విజువల్స్ అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, ముత్యాల సతీష్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.