ప్రభాస్ ‘స్పిరిట్’ లో మ్యాచో స్టార్..?

Kumar NA

Web Stories

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో రూపొందుతున్న ‘స్పిరిట్’ అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలను ఆకాశానికి చేర్చింది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక సంచలన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ మూవీలో ప్రభాస్‌కు ధీటైన ప్రతి నాయకుడిగా మ్యాచో స్టార్ గోపీచంద్ ఈ చిత్రంలో నటించబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

సుమారు 20 ఏళ్ల క్రితం7 విడుదలైన ‘వర్షం’ సినిమాలో ప్రభాస్, గోపీచంద్ మధ్య సాగిన పోరాటం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండస్ట్రీలో వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. సరైన పాత్ర పడితే ప్రభాస్ సినిమాలో నెగటివ్ రోల్ చేయడానికి సిద్ధమని గోపీచంద్ గతంలోనే ప్రకటించారు. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో విలన్ పాత్రలు చాలా రా అండ్ రస్టిక్ గా, హీరోకు ధీటుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో గోపీచంద్‌ను ఒక పవర్‌ఫుల్ విలన్‌గా చూపించేందుకు దర్శకుడు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వీరిద్దరి పాత్రల గురించి నెట్టింట రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి.

నిజాయితీ గల, కోపిష్టి పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపిస్తారని సమాచారం. ప్రభాస్‌ను సవాలు చేసే ఒక బలమైన గ్యాంగ్‌స్టర్ లేదా ప్రభావితం చేయగల రాజకీయ నాయకుడి పాత్రలో గోపీచంద్ కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ గోపీచంద్ విలన్‌గా ఫిక్స్ అయితే, ‘వర్షం’ నాటి ఆ పాత రైవల్రీని వెండితెరపై కొత్తగా చూడటం ఖాయం. ప్రభాస్, గోపీచంద్ మళ్ళీ కలిసి నటిస్తున్నారన్న వార్త అటు ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు, ఇటు గోపీచంద్ అభిమానుల్లోనూ రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. వీరిద్దరి మధ్య ఉండే ఆఫ్-స్క్రీన్ బాండింగ్, ఆన్-స్క్రీన్ వార్‌గా మారితే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ క్రేజీ కాంబినేషన్‌ కనుక వర్కౌట్ అయితే ‘స్పిరిట్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Manasa Varanasi Shivani Nagaram Heroine Nabanatesh Latest Pics Krithishetty Ritika Nayak