సంపూర్ణేష్‌బాబు ..ది ప్యారడైజ్‌ బిర్యాని

Viswa

Web Stories

Sampoornesh Babu: ‘హృదయకాలేయం’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన సంపూర్ణేష్‌బాబు ఆడియన్స్‌లో ఓ స్పెషల్‌ క్రేజ్‌ను ఏర్పరచుకున్నారు. వరుసగా కొన్ని వినోదా త్మక చిత్రాలు చేశారు సంపూర్ణేష్‌బాబు. అయితే తమిళంలో యోగిబాబు చేసిన ‘మండేలా’ సినిమా తెలుగు రీమేక్‌ ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ సినిమాలో హీరోగా, ఓ డిఫరెంట్‌ రోల్‌ చేశారు సంపూర్ణేష్‌బాబు. ఆ తర్వాత మళ్లీ ఒకట్రెండు కామెడీ సినిమాలు చేశారాయన.

అయితే ఇప్పుడు సంపూర్ణేష్‌బాబును ‘ది ప్యారడైజ్‌’ సినిమా కోసం కంప్లీట్‌గా తన లుక్‌ను మార్చేశారు. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ వలర్డ్‌ సినిమా ‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌బాబు ఓ బిర్యాని (Sampoornesh Babu play’s Biryan Role) అనే ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో జడల్‌ అనే పాత్రలో నాని కనిపిస్తాడు. జడల్‌కు నమ్మకస్తుడైన, స్నేహితుడైన బిర్యాని పాత్రలో సంపూర్ణేష్‌బాబు కనిపి స్తారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి సంపూర్ణేష్‌బాబు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కాస్త ఆసక్తికరంగానే ఉంది.

ఇంకా ఈ ‘ది ప్యారడైజ్‌’ సినిమాలో మోహన్‌బాబు, రాఘవ్‌ జుయల్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్‌ రవిచందర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ‘ది ప్యారడైజ్‌’ సినిమా వచ్చే మార్చి 26న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

Please Share
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi