భగవంత్‌ కేసరి రీమేక్‌ జననాయకుడు

Viswa

Web Stories

Jana Nayakudu trailer: కోలీవుడ్‌ టాప్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా  (Thalapathy Vijay) నటించిన సినిమా ‘జననాయగన్‌’. ఈ సినిమాను తెలుగులో ‘జననాయకుడు’ (Jana Nayakudu ) పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 9 (Jananayakudu Trailer)న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. తాజాగా ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ ట్రైలర్స్‌ (Jana Nayakudu trailer)ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వెంకట్‌.కె.నారాయణ ఈ సినిమాను నిర్మించారు. హెచ్‌. వినోద్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించారు. బాబీడియోల్, మమితాబైజు, ప్రకాష్‌రాజ్, ప్రియమణి, గౌతమ్‌వాసుదేవ్‌మీనన్‌ వంటివారు ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో నటించారు. విజయ్‌ కెరీర్‌లో ఈ సినిమా చివరి చిత్రం కావడంతో, ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి (Jana Nayakudu )

అయితే తెలుగులో సూపర్‌హిట్‌ కొట్టిన బాలకృష్ణ ‘భగవంత్‌సింగ్‌ కేసరి’ సినిమా తమిళ రీమేక్‌గా ‘జన నాయకుడు’ (Jananayakudu) సినిమా రూపుదిద్దుకుంటుందనే టాక్‌ మొదట్నుంచి వినిపిస్తుంది. అయితే ‘జననాయకుడు’ సినిమా ట్రైలర్‌ విడుదలైన తర్వాత, ఈ విషయం కన్ఫార్మ్‌ అయిపోయింది. జననాయకుడు సినిమాకు ‘భగవంత్‌సింగ్‌కేసరి’ సినిమాయే స్ఫూర్తి అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ చిత్రంలో విజయ్‌ కుమార్తెగా మమితాబైజు యాక్ట్‌ చేశారు.

అయితే ఈ ‘జననాయకుడు’ సినిమా తర్వాత విజయ్‌కి లాస్ట్‌ మూవీ. ఈ చిత్రం తర్వాత విజయ్‌ ఫుల్‌గా పాలిటిక్స్‌లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్‌ నుంచి వస్తున్న ఈ చివరి సినిమాలో కాస్త పొలిటికల్‌ టచ్‌ ఉన్న డైలాగ్స్‌ను బాగానే వాడారు. విజయ్‌ ఫ్యాన్‌ మూమెంట్స్‌ను బాగా బ్లెండ్‌ చేశారు దర్శకుడు హెచ్‌. వినోద్‌. కానీ కోలీవుడ్‌లో హ్యూజ్‌ స్టార్‌డమ్‌ ఉన్న విజయ్‌ చివరి సినిమా ఓ రీమేక్‌ కావడం, ఈ సినిమాకు ఓ కన్నడ నిర్మాత ఉండటం ఉండటం అనేది కొంతమంది తమిళ ఫ్యాన్స్‌కు కాస్త రుచించని విషయమనే చెప్పవచ్చు. అలాగే తెలుగులో ఆల్రెడీ ‘భగవంత్‌సింగ్‌ కేసరి’ సినిమాను చూసిన ఆడియన్స్, ఇప్పుడు ఈ సినిమా రీమేక్‌గా వస్తున్న ‘జన నాయకుడు’ సినిమాను ఎంత మేరకు ఆదరిస్తారో చూడాలి మరి..

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos