please subscribe to Tollywoodhub YouTube channel

డాక్టర్ పట్టా అందుకున్న శ్రీలీల.. ఫోటోలు వైరల్!

Kumar NA

Web Stories

Sreeleela Got Doctor Degree: టాలీవుడ్ ‘గ్లామర్ డాల్’ శ్రీలీల (Sreeleela) కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ అద్భుత ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ యంగ్ బ్యూటీ తన చిరకాల స్వప్నమైన MBBS డిగ్రీని పూర్తి చేసి, తన పేరు ముందు ‘డాక్టర్’ అనే గౌరవప్రదమైన హోదాను దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన కాన్వోకేషన్ వేడుకలో శ్రీలీల తన మెడికల్ పట్టాను అందుకున్నారు (Sreeleela Got Doctor Degree).

ఆమె డాక్టర్ కోటు ధరించి, పట్టా పుచ్చుకున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాయి. ప్రముఖ గైనకాలజిస్ట్ అయిన తన తల్లి, డాక్టర్ స్వర్ణలత అడుగుజాడల్లో నడవాలన్నదే శ్రీలీల ఆశయం. చిన్నతనంలో తన అమ్మమ్మ అనారోగ్యం పాలైనప్పుడు కలిగిన సేవా భావమే ఆమెను వైద్య వృత్తి వైపు నడిపించింది. గత ఏడాది శ్రీలీల కాల్‌షీట్లు సినిమాలతో నిండిపోయి ఉన్నాయి. ఒకవైపు వరుస షూటింగ్‌లు, మరోవైపు కఠినమైన వైద్య విద్య.. షూటింగ్ గ్యాప్‌లోనూ ఏమాత్రం సమయం వృధా చేయకుండా పుస్తకాలతో కుస్తీ పట్టి, ఈ ఘనత సాధించడం ఆమె పట్టుదలకు నిదర్శనం. ఒక వైపు వెండితెరపై డ్యాన్సులతో మెప్పించడం, మరోవైపు సమాజానికి సేవ చేసే వైద్యురాలిగా బాధ్యతను స్వీకరించడం అభినందనీయం.

శ్రీలీల మల్టీ-టాస్కింగ్‌కి ఒక నిలువెత్తు సాక్ష్యం అని చెప్పొచ్చు. సినిమా రంగంలో ఎంత బిజీగా ఉన్నా, చదువుపై ఆమె చూపిన శ్రద్ధ నేటి తరం యువతకు నిజమైన స్ఫూర్తి. ప్రస్తుతం నెటిజన్లు ఆమెను ‘డాక్టర్ శ్రీలీల’ అంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi