please subscribe to Tollywoodhub YouTube channel

మిస్టరీగా వరలక్ష్మి శరత్ కుమార్ సరస్వతీ ట్రైలర్..!

Kumar NA
1 Min Read

Web Stories

Actress Varalakshmi Sarathkumar Saraswati trailer: సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పటివరకు వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. హీరోయిన్‌గా, విలన్‌గా భిన్నమైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆమె దర్శకురాలిగా కూడా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నారు. స్వీయ దర్శకత్వంలో “సరస్వతి” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో వరలక్ష్మి ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా స్వీకరించారు. అభినవ గోమటం, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను నాచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సమంత విడుదల చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ చూస్తే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అని తెలుస్తోంది. సరస్వతి అనే చిన్నారి మిస్సింగ్ కేసు నేపథ్యంలో కథ సాగుతుంది. ఆ చిన్నారి వరలక్ష్మి కూతురు పాత్రలో కనిపిస్తుంది. కూతురు కనిపించకపోవడంతో ఆమె కోసం తల్లి చేసే పోరాటమే ఈ సినిమా ప్రధానాంశం. చివరికి వరలక్ష్మి గన్ పట్టుకుని యాక్షన్ మోడ్‌లో కనిపించడం ఆసక్తిని పెంచుతోంది. “ప్రతి అమ్మాయి సరస్వతి లాగా ఉండదు… అవసరమైతే కాళిలా మారుతుంది” అనే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రకాష్ రాజ్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రాన్ని వరలక్ష్మి, ఆమె చెల్లెలు పూజ శరత్ కుమార్ కలిసి దోసా డైరీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఎస్.ఎస్. తమన్ అందించారు. షూటింగ్ పూర్తయినా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. నటిగా విజయాలు అందుకున్న వరలక్ష్మి, దర్శకురాలిగా కూడా సక్సెస్ సాధిస్తారా అనేది చూడాలి.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi